Begin typing your search above and press return to search.

కల్కిలా చేస్తానంటే ఎలా దేవర..?

కల్కి సినిమా కూడా అంతే ఎప్పుడో ట్రైలర్ వదిలారు. ఆ తర్వాత సరైన ప్రమోషన్స్ లేకుండానే సినిమా రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   11 July 2024 6:46 AM GMT
కల్కిలా చేస్తానంటే ఎలా దేవర..?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. ముందు ఒక సినిమాగా చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ కాస్త కొంత పార్ట్ షూట్ అయ్యాక రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలు డబుల్ చేయగా సినిమా గురించి తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా ఆసక్తి కనబరుస్తున్నారు.

ఐతే చిత్ర యూనిట్ మత్రం దేవర సినిమా గురించి ఎక్కువగా ప్రచారం చేయకూడదని అనుకుంటున్నారట. టీజర్, ట్రైలర్ వరకు ఓకే కానీ పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ లేకుండానే దేవర ని వదలాలని అనుకుంటున్నారట. దీని వెనుక రీజన్ ఈమధ్యనే వచ్చిన ప్రభాస్ కల్కి అని తెలుస్తుంది. కల్కి సినిమా కూడా అంతే ఎప్పుడో ట్రైలర్ వదిలారు. ఆ తర్వాత సరైన ప్రమోషన్స్ లేకుండానే సినిమా రిలీజ్ చేశారు.

ఐతే సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కించారు కాబట్టి రెబల్ ఫ్యాన్స్ ప్రమోషన్స్ గురించి మాట్లాడకుండా ఆఫ్టర్ రిలీజ్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కల్కి 2898 AD తో మరో 1000 కోట్ల సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. ఐతే ఆ సినిమా పంథాలోనే పెద్దగా సినిమా గురించి లీక్స్ ఇవ్వకుండా దేవర ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ప్రభాస్ కల్కి సినిమా వేరు.. దేవర వేరు. కల్కిలో అమితాబ్, కమల్ హాసన్, దీపిక ఇలా అంతా ఉన్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే అఫ్కోర్స్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఉన్నా అతను అంతగా ప్రభావితం చేయకపోవచ్చు. ముఖ్యంగా దేవర కోసం పాన్ ఇండియా ఆడియన్స్ లో ఆసక్తి కలిగించాలంటే మాత్రం సరైన ప్రమోషనల్ కంటెంట్ ని సిద్ధం చేయాల్సిందే. మరి దేవర ప్లానింగ్ ఎలా ఉంది.. రిలీజ్ వరకు ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారన్నది చూడాలి.

ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ మీద నమ్మకంతో ఎన్టీఆర్ దేవర చేస్తున్నాడు. మరి తారక్ పెట్టిన నమ్మకాన్ని కొరటాల శివ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అన్నది చూడాలి. దేవర సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా సంగీతం పరంగా కూడా సినిమా ఒక రేంజ్ లో ఉండాలని చూస్తున్నారు. ఇక సినిమాలో తారక్ తో జాన్వి కపూర్ జత కడుతుంది. సినిమాలో గ్లామర్ పరంగా డౌట్ పడక్కర్లేదని చిత్ర యూనిట్ చెబుతున్నారు.