Begin typing your search above and press return to search.

దేవర.. లేటయినా టెన్షన్ లేకుండా..

మధ్య మధ్యలో ఊహించిన విధంగా బ్రేకులు పడ్డప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు

By:  Tupaki Desk   |   13 March 2024 1:30 AM GMT
దేవర.. లేటయినా టెన్షన్ లేకుండా..
X

ఆచార్య లాంటి డిజాస్టర్ ఎదురైనప్పటికీ కూడా కొరటాల శివ అసలు ఏ మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా దేవర సినిమా ను భారీ స్థాయిలో తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కథ విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకున్న ఈ దర్శకుడు షూటింగ్ ను కూడా పక్క ప్రణాళికతో ఫినిష్ చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఊహించిన విధంగా బ్రేకులు పడ్డప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు.

ఒకవైపు నిర్మాత పై భారం పడకుండా మరొకవైపు నటీనటులను డేట్స్ కూడా ఇబ్బంది రాకుండా కొరటాల సినిమా పనులను పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక జనవరిలో మొదలు కావలసిన ఒక కీలకమైన షెడ్యూల్ హఠాత్తుగా ఆగిపోయిన విషయం తెలిసిందే. సినిమాలో ప్రతి నాయకుడిగా కనిపిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ హఠాత్తుగా గాయానికి గురవడంతో షూటింగ్ అనుకున్నట్లు జరగలేదు.

దీంతో ఆ ప్రభావం సినిమా విడుదల డేట్ పై కూడా పడింది. ఆగస్టులో ఏప్రిల్ లో రావాల్సిన ఈ సినిమా ఊహించిన విధంగా అక్టోబర్ కు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొరటాల శివ మరింత జాగ్రత్తగా సినిమాను అనుకున్నా సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని షూటింగ్ నూ కొనసాగిస్తున్నారు. గోవాలో ఒక కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. మొదట ఒక సెట్ లో లేటెస్ట్ సీన్స్ షూట్ చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ హఠాత్తుగా ప్లాన్ గోవాకు మార్చారు

అయితే గోవాను సెలెక్ట్ చేసుకోవడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఈసారి సమ్మర్ ఎంత వేడిగా ఉంటుందో ఈపాటికి అందరికి అర్థమై ఉంటుంది. అయితే నటీనటులకు అలాగే షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొరటాల శివ గోవాలో ఒక ప్రత్యేకమైన ప్లేస్ లో సినిమా షూటింగ్ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒక సాంగ్ కూడా అక్కడే షూట్ చేయబోతున్నారు.

వాతావరణం ప్రస్తుతం అక్కడ చల్లగానే ఉంటుంది. ఎంత వేడి ఉన్నా కూడా సముద్ర తీరంలో కాస్త చల్లని గాలులు ఉపశమనం కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి నటీనటులకు టెక్నీషియన్స్ ఎవరు కూడా అంతగా ఇబ్బంది పడరు. అందుకే కొరటాల శివ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్లాన్ మిస్ అయినా వెంటనే మరొక ప్లాన్ తో సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసేలా చూస్తూ ఉన్నాడు.

ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 10న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.