Begin typing your search above and press return to search.

దేవర.. దీనికి థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం పక్కా

అనిరుద్ ఈ సాంగ్ ని ఇప్పటికే సిద్ధం చేశారంట. చిత్రీకరణకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ షూట్ కోసం ప్రస్తుతం సెట్ వర్క్ చేస్తున్నారంట.

By:  Tupaki Desk   |   26 Feb 2024 4:00 AM GMT
దేవర.. దీనికి థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం పక్కా
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం దేవర. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రెడీ అవుతోన్న ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత పకడ్బందీగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని కొరటాల శివ దేవర మూవీని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

సైఫ్ ఆలీఖాన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందంట. కీలకమైన యాక్షన్ ఘట్టాలు అన్ని ఫినిష్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మూవీలో విలన్స్ ని భయంకరంగా ఊచకోత కోసే యాక్షన్ సన్నివేశానికి ముందు వచ్చే ఆయుధ పూజ సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

అనిరుద్ ఈ సాంగ్ ని ఇప్పటికే సిద్ధం చేశారంట. చిత్రీకరణకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ షూట్ కోసం ప్రస్తుతం సెట్ వర్క్ చేస్తున్నారంట. సరికొత్త అనుభూతి ఇచ్చే విధంగా ఈ సాంగ్ చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. విజువల్ పరంగా ఆడియన్స్ కి గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే విధంగా సాంగ్ హై వోల్టేజ్ ఎలివేషన్ తో ఉండబోతోందంట.

కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న దేవర మూవీ రెండు భాగాలుగా రానున్నట్లు ఇప్పటికే కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. కచ్చితంగా తారక్ అభిమానులు అందరూ గర్వపడేలా మూవీ ఉంటుందని టాక్. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి.

ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత తారక్ హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తోన్న వార్ 2 కోసం రెడీ అవుతారు. తారక్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వెయిట్ చేస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.