Begin typing your search above and press return to search.

'దేవర'... అంత ఈజీ కాదు!

ఇలా ఏ విధంగా చూసుకున్న దేవర సినిమా అక్టోబర్ నెలలో టఫ్ కాంపిటేషన్ ఎదురవుతోంది. ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే సాధ్యం అవుతుందనేది సినీ విశ్లేషకుల మాట.

By:  Tupaki Desk   |   6 April 2024 5:00 AM GMT
దేవర... అంత ఈజీ కాదు!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో చేస్తోన్న సినిమా దేవర. కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఏడాది సమయం తీసుకొని తారక్ కోసం ఈ కథని సిద్ధం చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, భారీ ఎలివేషన్ సన్నివేశాలు దేవర సినిమాలో పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. కంప్లీట్ ఫిక్షనల్ ప్రపంచంలో ఈ సినిమా కథ నడవబోతోంది.

సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తూ ఉండగా, జాన్వీకపూర్ టాలీవుడ్ లోకి దేవర మూవీతో ఎంట్రీ ఇస్తోంది. దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా భారీ హైప్ నెలకొని ఉంది. ఇక సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ కావాలి అంటే మిగతా భాషల్లో కూడా సినిమా మినిమమ్ క్లిక్కవ్వాలి. పోటీగా కూడా ఇతర సినిమాలు ఉంటే కాస్త కష్టమే.

ఇక దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. నిజానికి ఏప్రిల్ 5న దేవర మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యుంటే దేవర సినిమాకి ఎలాంటి పోటీ ఉండేది కాదు. దానికితోడు సెలవులు కూడా కలిసొచ్చి కచ్చితంగా మూవీ హిట్ టాక్ తెచ్చుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

దేవరకి రిలీజ్ అయ్యే టైంలోనే తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న విడా ముయార్చి మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ వేటయాన్ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. తమిళంలో ఈ రెండు సినిమాలని దాటుకొని దేవర నిలబడాలి అంటే మామూలు విషయం కాదు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్ ఆఖరులో దేవర సినిమాకి రెండు వారాల ముందు వస్తుంది. ఆ డేట్ మిస్ అయితే దేవరకి పోటీగా వచ్చిన రావొచ్చని టాక్. ఇక OG ఊహించని రేంజ్ లో హైప్ తెచ్చుకుంటే ఆ తాకిడి దేవర రిలీక్ టైమ్ వరకు ఉండవచ్చు. అలాగే అక్కినేని నాగ చైతన్య తండెల్ కూడా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ చిత్ర దర్శకుడు చందు వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇలా ఏ విధంగా చూసుకున్న దేవర సినిమా అక్టోబర్ నెలలో టఫ్ కాంపిటేషన్ ఎదురవుతోంది. ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే సాధ్యం అవుతుందనేది సినీ విశ్లేషకుల మాట. ఎన్టీఆర్ కి దేవరతో కచ్చితంగా సోలో హిట్ కావాలి. అలాగే ఆచార్య కొట్టిన దెబ్బ నుంచి కోలుకొని మళ్ళీ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగించాలంటే కొరటాల శివ కూడా గ్యారెంటీ హిట్ అందుకోవాలి. మరి ఈ పోటీని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.