Begin typing your search above and press return to search.

ఎన్.టి.ఆర్ దేవర.. ఇది సరిపోదు..!

సినిమా పోస్టర్స్, సాంగ్స్ అవి కుదరకపోతే సినిమా అప్డేట్స్ తో అయినా ఫ్యాన్స్ ని ఖుషి చేయాల్సి ఉంటుంది

By:  Tupaki Desk   |   27 July 2023 5:30 PM GMT
ఎన్.టి.ఆర్ దేవర.. ఇది సరిపోదు..!
X

ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా లోనే కాదు హాలీవుడ్ లో కూడా ప్రభంజనం సృష్టించారు రాం చరణ్, ఎన్.టి.ఆర్. ఇద్దరు హీరోలకు ఈ సినిమా ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చేలా చేసింది. అందుకే నెక్స్ట్ వీరిద్దరు చేస్తున్న సినిమాల మీద ఆ ఇంప్యాక్ట్ కనిపిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ ఆల్రెడీ ఆచార్య చేశాడు. అది కాస్త నిరాశపరచింది. ప్రస్తుతం రాం చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి చరణ్ తన సత్తా చాటబోతున్నాడని తెలుస్తుంది.

ఇక ఎన్.టి.ఆర్ విషయానికి వస్తే కొరటాల శివతో దేవర అంటూ ఒక భారీ ప్రాజెక్ట్ షురూ చేశాడు తారక్. యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవర టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. నేషనల్ వైడ్ గా ఎన్.టి.ఆర్ కి ఉన్న ఇమేజ్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ అని చెప్పుకునేలా చేసింది. అయితే స్టార్ సినిమా అంటే సినిమాకు క్లాప్ కొట్టిన నాటి నుంచి రిలీజ్ వరకు సినిమా గురించి ఫ్యాన్స్ లో డిస్కషన్ జరిగేలా ప్రమోషన్స్ చేయాలి.

సినిమా పోస్టర్స్, సాంగ్స్ అవి కుదరకపోతే సినిమా అప్డేట్స్ తో అయినా ఫ్యాన్స్ ని ఖుషి చేయాల్సి ఉంటుంది. సినిమా నుంచి వచ్చే అప్డేట్ తో ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమాకు ఎంగేజ్ అయ్యి ఉంటారు. కానీ దేవర విషయంలో అది మిస్ అవుతుంది. దేవర ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలిన కొరటాల శివ మళ్లీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు తప్ప సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు. దేవర గురించి ఫ్యాన్స్ కోరుతున్న అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి సినిమాపై ఒక క్రేజ్ వచ్చేలా చేయాల్సి ఉంది.

కానీ కొరటాల శివ ఆ విషయంలో చాలా వెనకపడి ఉన్నాడు. అయితే ఇవేమి చేయకపోయినా సినిమా అవుట్ పుట్ బాగుంటే మాత్రం రికార్డులు కొట్టడం ఖాయం. కానీ ఎన్.టి.ఆర్ లాంటి స్టార్ సినిమా ఏం జరుగుతుంది అన్న ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో ఉంటుంది.

అందుకోసమైనా ఏదో ఒక చిన్న అప్డేట్ లాంటిది ఇస్తే ఫ్యాన్స్ ఖుషి అవుతారు. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే రిలీజ్ చాలా టైం ఉంది కదా ఇప్పుడే ప్రమోషన్స్ ఎందుకు అనుకుంటున్నారేమో కానీ సినిమాను ఎంత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తే అంత క్రేజ్ వస్తుందనే లాజిక్ మిస్ అవుతున్నారు దేవర టీం.