Begin typing your search above and press return to search.

దేవర.. అంతకుమించి అనేలా ప్రేమ్ రక్షిత్ ప్లాన్

గత ఏడాది విడుదలైన RRR మూవీ లో 'నాటు నాటు' పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ పాటలో వేసిన స్టెప్స్ కి సినీ ప్రపంచమంతా ఫిదా అయిపోయింది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 8:45 AM GMT
దేవర.. అంతకుమించి అనేలా ప్రేమ్ రక్షిత్ ప్లాన్
X

గత ఏడాది విడుదలైన RRR మూవీ లో 'నాటు నాటు' పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ పాటలో వేసిన స్టెప్స్ కి సినీ ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ముఖ్యంగా 'నాటు నాటు' హుక్ స్టెప్స్ కి హాలీవుడ్ ఆడియన్స్ సైతం చిందులేసారు. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకి ఏకంగా ఆస్కార్ కూడా వచ్చింది.

ఇక ఈ పాటతో కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ కి ఎంతో మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు 'నాటు నాటు'ను మించి ఏకంగా 2000 మంది డాన్సర్స్ తో అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేశారట ప్రేమ్ రక్షిత్ మాస్టర్. అది కూడా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాలో ప్లాన్ చేయడం విశేషం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' మూవీలో సుమారు 2000 మంది డాన్సర్స్ తో ఓ సాంగ్ ప్లాన్ చేశారు.

'నాటు నాటు' ఫేమ్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ ఉండబోతుందట. పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీ భారీ స్కేల్ ని ప్రతిబింబించే పాటగా దీన్ని డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ సెట్ కూడా వేయనున్నట్ల సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ ని షూట్ చేయనున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దేవర షూటింగ్ జరుగుతుంది.

ఎన్టీఆర్ తో పాటు సినిమాలో ప్రధాన తారాగణంపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ముగిసిన గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వి కపూర్ లపై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆచార్య మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ దేవర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తన గత చిత్రాలన్నింటికంటే భిన్నంగా దేవర మూవీని భారీ స్కేల్లో తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగాజ్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలిసింది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.