Begin typing your search above and press return to search.

దేవర.. ఇంతకంటే హీటెక్కించే కిక్ ఉంటుందా?

స్కా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ను కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 7:11 AM GMT
దేవర.. ఇంతకంటే హీటెక్కించే కిక్ ఉంటుందా?
X

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దేవర. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా నందమూరి అభిమానుల్లో మాత్రమే కాకుండా సాధారణ ఆడియెన్స్ దృష్టిలో కూడా ఒక మంచి హైఫైతే క్రియేట్ చేసుకుంటుంది. కొరటాల శివ ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ అందుకున్నప్పటికీ దేవర అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా అర్థమవుతుంది.

స్కా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ ను కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో చాలా తెలివైన అడుగులు వేస్తున్నారు అని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన గోవా షెడ్యూల్ కూడా ఇటీవల జెట్ స్పీడ్ లోనే ఫినిష్ అయ్యింది.

ఇందులో కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ మాత్రమే కాకుండా ఒక సాంగ్ ను షూట్ చేయడం జరిగిందట. దాదాపు 2000 మంది డాన్సర్స్ తో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ చేసిన తీరు సినిమాలో చాలా హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక సినిమాలో కొన్ని పాటలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత మాస్టర్ వర్క్ చేస్తున్నారు. గతంలోనే పవర్ఫుల్ సాంగ్స్ కు డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ RRR సినిమాలో కూడా నాటు నాటు పాటకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసి ఆస్కార్ వరకు వెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇక ఇప్పుడు అలాంటి డాన్స్ మాస్టర్ దేవర సినిమాకు ఎన్టీఆర్ కోసం వర్క్ చేస్తూ ఉండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ హై వోల్టేజ్ కాంబినేషన్ కు అనిరుద్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ప్రేమ్ రక్షిత్ జూనియర్ ఎన్టీఆర్ అనిరుద్ కాంబినేషన్ మాత్రం కిక్ కాదు.. అంతకుమించి అనేలా ఉంటుంది అనిపిస్తుంది