Begin typing your search above and press return to search.

హాబీబీ.. దేవరకొండ కిర్రాక్ లుక్

సినిమా షూటింగ్ అయితే ఆగలేదు కానీ విజయ్ దేవరకొండ మాత్రం కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:43 PM GMT
హాబీబీ.. దేవరకొండ కిర్రాక్ లుక్
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్నారు నెక్స్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ప్రొడక్షన్లో పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొన్నటి వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా కొనసాగింది. అయితే దాదాపు మూడు షెడ్యూల్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకున్నాడు.


సినిమా షూటింగ్ అయితే ఆగలేదు కానీ విజయ్ దేవరకొండ మాత్రం కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కొనసాగుతున్న షూటింగ్లో విజయ్ ఏ మాత్రం అవసరం లేదట. మిగతా ఆర్టిస్టులతో దర్శకుడు కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ దుబాయ్ వెళ్లి అక్కడ హాలిడేస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా అతనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దుబాయ్ షేక్ తరహాలో విజయ్ దేవరకొండ అక్కడి వాతావరణంలో నల్లటి కళ్ళజోడు పెట్టుకుని స్టైలిష్ గా స్టిల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ ఎలాంటి లుక్ లో కనిపించిన కూడా అదిరిపోతుంది అని మరోసారి రుజువైంది.

ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే. చాలా తక్కువ టైమ్ ఉండడంతో దర్శకుడు పరశురామ్ గ్యాప్ లేకుండా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఈ సినిమా కోసమే విజయ్ గౌతమ్ తిన్ననూరి తో చేయాల్సిన ప్రాజెక్టును పక్కన పెట్టాడు. దీంతో ఆ దర్శకుడు మరో సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. విజయ్ ఈసారి సంక్రాంతికి ఎలాగైనా ఫ్యామిలీ స్టార్ సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని అనుకుంటున్నాడు.

ఎందుకంటే అతని గత రెండు సినిమాలు లైగర్ , ఖుషీ రెండు కూడా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. దీంతో ఫ్యామిలీ స్టార్ పైనే అతను ఆశలన్ని పెట్టుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు అనంతరం కూడా వెంటనే మరొక రెండు ప్రాజెక్టులను లైన్ లోకి తీసుకొనిరానున్నాడు. భవిష్యత్తులో సుకుమార్ కూడా అతను వర్క్ చేయాల్సి ఉంది.