Begin typing your search above and press return to search.

ఖుషి.. అక్కడ మాత్రం గట్టిగానే..

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:48 AM GMT
ఖుషి.. అక్కడ మాత్రం గట్టిగానే..
X

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా డీసెంట్ రన్ ని వీకెండ్ తర్వాత చూపిస్తోంది. ఇప్పటికే చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అందుకున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి తెలుగులో అయితే హిట్ టాక్ వచ్చినట్లే.

గీతాగోవిందం, టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన డియర్ కామ్రేడ్, మోస్ట్ ఫేమస్ లవ్, లైగర్ డిజాస్టర్ అయ్యాయి. హ్యాట్రిక్ అపజయాల తర్వాత ఖుషి మూవీతో మళ్ళీ విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. శాకుంతలం లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తర్వాత ఖుషి మూవీ మళ్ళీ తనకి ఊపు తీసుకొచ్చింది.

ఇప్పటికే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసేసింది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వర్కౌ 40 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే డీసెంట్ కలెక్షన్స్ ని రాబడుతుంది. జవాన్ మూవీ రిలీజ్ కావడంతో ఆ ప్రభావం ఖుషిపై పడే ఛాన్స్ ఉంది. ఇకపోతే తమిళ్ లో కూడా ఖుషి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు కోటి రూపాయిల గ్రాస్ ని ఈ మూవీ కలెక్ట్ చేసింది.

వీకెండ్ రెండు రోజులు కూడా పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ తో తమిళ్ లో ఖుషి మూవీ రిలీజ్ కాగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. అయితే జవాన్ మూవీ రిలీజ్ కావడంతో తమిళనాట ఖుషి కంప్లీట్ గా డ్రాప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఓవరాల్ గా విజయ్ దేవరకొండ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా ఖుషి మూవీ నిలిచే ఛాన్స్ ఉందని టాక్.

అయితే నార్త్ ఇండియాలో మాత్రం ఖుషి హిందీ వెర్షన్ కి ఆశించిన స్థాయిలో ఆదరణ రావడం లేదు. విజయ్ దేవరకొండ, సమంత నార్త్ స్టేట్స్ లో సినిమాని పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఈ కారణంగా ఖుషి చిత్రంపై హిందీ ఆడియన్స్ ఫోకస్ లేదని తెలుస్తోంది.