Begin typing your search above and press return to search.

ఖుషి ఫస్ట్ డే.. అంత వెనక్కి తెస్తుందా?

తెలుగు రాష్ట్రాలలో 5 కోట్ల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఖుషి చిత్రానికి జరిగాయంట. ఓవరాల్ గా 6 కోట్ల వరకు బుకింగ్స్ అయ్యాయని తెలుస్తోంది

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:21 AM GMT
ఖుషి ఫస్ట్ డే.. అంత వెనక్కి తెస్తుందా?
X

విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖుషి. ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ షోలు పడిపోయాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయాయి. శివ నిర్వాణ నుంచి రాబోతున్న మరో క్లాసిక్ హిట్ ఖుషి అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని విజయ్ దేవరకొండ ఖుషి మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. శివ నిర్వాణకి దీనికంటే ముందుగా టక్ జగదీశ్ రూపంలో డిజాస్టర్ ఉంది. శాకుంతలం సినిమాతో ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని సమంత ఖాతాలో వేసుకుంది. ఈ ముగ్గురికి ఖుషి మూవీ చాలా కీలకమని చెప్పాలి. అయితే తమ బెస్ట్ అవుట్ ఫుట్ ని ఈ మూవీలో ముగ్గురు కలిసి అందించారు.

ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ సినిమాకి వస్తోంది. అయితే ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో కలెక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అనేది సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లైగర్ కి దేశ వ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ కావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఖుషికి ఆ స్థాయిలో రాకున్న అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం గట్టిగానే అయ్యాయంట.

తెలుగు రాష్ట్రాలలో 5 కోట్ల గ్రాస్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ఖుషి చిత్రానికి జరిగాయంట. ఓవరాల్ గా 6 కోట్ల వరకు బుకింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా 3 లక్షల డాలర్లు వరకు బుకింగ్స్ ద్వారా గ్రాస్ కలెక్ట్ అయ్యిందంట. ఈ లెక్కన చూసుకున్న ఫస్ట్ డే ఓవరాల్ గా 8-9 కోట్ల వరకు షేర్ ని ఖుషి చిత్రం కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇది 10 కోట్లు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితుల మాట.

సినిమాకి ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ వస్తుందో దానిని బట్టి ఫస్ట్, సెకండ్ షోకి బుకింగ్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం శని, ఆదివారాలు ఖుషి జోరుని ఎవరూ ఆపలేరు. మొదటి రోజు కంటే కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు.