Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ స్టార్ ప్లానింగ్ అదుర్స్..!

ఖుషి తర్వాత విజయ్ నుంచి వచ్చే సినిమా అదే అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది

By:  Tupaki Desk   |   15 Aug 2023 9:30 AM GMT
ఫ్యామిలీ స్టార్ ప్లానింగ్ అదుర్స్..!
X

విజయ్ దేవరకొండ ఖుషి మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమా తర్వాత సూపర్ హిట్ కాంబో రిపీట్ చేస్తూ మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురాం తో విజయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. ఖుషి తర్వాత విజయ్ నుంచి వచ్చే సినిమా అదే అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమాలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సీతారామం తో సూపర్ హిట్ అందుకుని తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న మృణాల్ ఓ పక్క నానితో హాయ్ నాన్న సినిమా చేస్తూ మరోపక్క విజయ్ తో ఈ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ ఈ సినిమాకు చిత్ర యూనిట్ అంతా కూడా ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారట. దాదాపు సినిమా టైటిల్ గా అదే ఫిక్స్ చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దివ్యాన్ష కౌశిక్ ని సెలెక్ట్ చేసినట్టు టాక్. నాగ చైతన్య మజిలీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యాన్ష కౌశిక్ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, సందీప్ కిషన్ మైఖేల్ సినిమాలో నటించింది. రీసెంట్ గా సిద్ధార్థ్ తో కలిసి టక్కర్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది దివ్యాన్ష. మజిలీ తప్ప మిగతా సినిమాలేవి దివ్యాన్షకి హిట్ ఇవ్వలేదు కానీ అమ్మడు సినిమాలో ఉంటే కావాల్సినంత గ్లామర్ షో ఉంటుంది. ప్రమోషన్స్ లో కూడా దివ్యాన్ష స్కిన్ షో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

సరైన సినిమా కోసం ఎదురుచూస్తున్న దివ్యాన్షకి విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేతికి వచ్చింది. ఈ సినిమాతో అమ్మడి ఫేట్ మారుతుందేమో చూడాలి. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఒకవేళ పొంగల్ రేసులో సినిమాలు ఎక్కువ ఉంటే మార్చి, ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో కూడా విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. సో విజయ్ ప్లానింగ్ చూస్తుంటే ఈసారి మాత్రం టార్గెట్ అసలు మిస్ అయ్యేలా లేడని అనిపిస్తుంది.