Begin typing your search above and press return to search.

దేవర ఫిక్స్ అయ్యాడు కల్కి ఏం చేస్తాడో..?

సమ్మర్ రిలీజ్ కుదరదని తెలిసి మరో మంచి డేట్ చూడాలని అనుకున్న దేవర టీం దసరాకి పర్ఫెక్ట్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 12:30 AM GMT
దేవర ఫిక్స్ అయ్యాడు కల్కి ఏం చేస్తాడో..?
X

సమ్మర్ కి రిలీజ్ అనుకున్న ఎన్టీఆర్ దేవర కాస్త దసరాకి రిలీజ్ లాక్ చేసుకున్నాడు. దసరా బరిలో అక్టోబర్ 10న దేవర ఆగమనం ఉండబోతుంది. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కాగా మళ్లీ ఆ హిట్ కాంబో రిపీట్ చేస్తూ దేవర చేస్తున్నారు. ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేసిన దేవర సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పెండింగ్ వల్ల సినిమా వాయిదా వేశారు. సమ్మర్ రిలీజ్ కుదరదని తెలిసి మరో మంచి డేట్ చూడాలని అనుకున్న దేవర టీం దసరాకి పర్ఫెక్ట్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

సమ్మర్ కి వస్తుందనుకున్న దేవర దసరాకి లాక్ చేశారు. అయితే సమ్మర్ కి రిలీజ్ అనుకున్న మరో భారీ సినిమా కల్కి రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. అసలైతే ప్రభాస్ కల్కి 2898 AD సినిమాను మే 9న రిలీజ్ లాక్ చేశారు. నాగ్ అశ్విన్ వైజయంతి కాంబోలో భారీ బడ్జెట్ లో ఈ సినిమా వస్తుంది. 500 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించడంతో సినిమా అవుట్ పుట్ విషయంలో మేకర్స్ చాలా ఫోకస్ తో ఉన్నారు.

రిలీజ్ డేట్ మిస్ అవుతుందని అనుకున్న డేట్ కే తీసుకు రావాలని హడావిడి చేయకుండా సినిమా అనుకున్న అవుట్ పుట్ వచ్చినప్పుడే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి మే లో వస్తుందన్న నమ్మకం తక్కువే. దేవర కూడా ఏప్రిల్ రిలీజ్ అనుకుని అక్టోబర్ కి వాయిదా పడ్డాడు. ఇప్పుడు కల్కి కూడా మే వాయిదా పడితే ఎప్పుడు రిలీజ్ అంటాడో చూడాలి.

మే రిలీజ్ అయితే సరే లేదంటే కల్కి కి మరో అద్భుతమైన డేట్ చూడాల్సి ఉంటుంది. అయితే ఆగష్టు 15, సెప్టెంబర్ 27 ఆల్రెడీ అల్లు అర్జున్, పవన్ సినిమాలు రిలీజ్ లాక్ చేశాయి. సో అక్టోబర్ లో దేవరకి పోటీగా అయినా రావాలి లేదా ఆగష్టు కన్నా ముందే అంటే మే మిస్ అయితే జూన్, జూలైలో అయినా సినిమా రిలీజ్ చేయాలి. మరి కల్కి రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారో మేకర్స్ కి తెలియాలి. అయితే ఎప్పుడొచ్చినా కల్కి రికార్డుల ప్రభంజనం సృష్టించడం పక్కా అనేస్తున్నారు చిత్ర యూనిట్. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కల్కి మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు.