Begin typing your search above and press return to search.

దేవర ఫస్ట్ సింగిల్.. ఎదురుగా ఉన్న రికార్డ్స్ ఇవే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బిగ్ మూవీ దేవర.

By:  Tupaki Desk   |   17 May 2024 4:27 AM GMT
దేవర ఫస్ట్ సింగిల్.. ఎదురుగా ఉన్న రికార్డ్స్ ఇవే!
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బిగ్ మూవీ దేవర. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మే 19న రిలీజ్ చేయబోతున్నారు. దేవర టైటిల్ సాంగ్ ని ఫస్ట్ సింగిల్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. గత ఏడాది జైలర్, లియో సినిమాలకి అనిరుద్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించి ఆ సినిమాల సక్సెస్ లో భాగం అయ్యాడు. జైలర్ మూవీ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ అనిరుద్ కి దక్కుతుంది.

కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుద్ కి తెలుగులో మాత్రం ఆశించిన సక్సెస్ రాలేదు. అయితే దేవర చిత్రంతో టాలీవుడ్ లో ఉన్న నెగిటివ్ ఇమేజ్ దూరం చేసుకోవాలని అనిరుద్ అనుకుంటున్నాడు. దేవర ఫస్ట్ సాంగ్ తో వండర్స్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడు. ఈ ఫస్ట్ సింగిల్ బ్రేక్ చేయడానికి చాలా రికార్డులు ముందున్నాయి.

తెలుగులో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో దమ్ మసాలా సాంగ్ పేరు మీద ఉంది. ఈ పాటకి 17.42 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లైక్స్ పరంగా సర్కారువారిపాట సినిమాలోని కళావతి సాంగ్ 9 నిమిషాల్లో లక్ష లైక్స్ సొంతం చేసుకుంది. 24 గంటల్లో 806.3 కె లైక్స్ సాధించింది.

ఈ రికార్డులని దేవర ఫస్ట్ సింగిల్ ముందుగా బ్రేక్ చేయాల్సి ఉంది. పుష్ప ఫస్ట్ సింగిల్ ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయింది. ఒక వేళ దేవర మూవీ టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్, లైక్స్ రికార్డ్ బ్రేక్ చేస్తే తరువాత సౌత్ లో 24 గంటల రికార్డ్స్ ఉన్నాయి. ఇళయదళపతి విజయ్ GOAT మూవీలో విజిల్ పోడు సాంగ్ 24.88 మిళియన్స్ వ్యూస్ 24 గంటల్లో సాధించింది. లైక్స్ పరంగా బీస్ట్ లోని అరబిక్ కతు సాంగ్ టాప్ లో ఉంది. ఈ సాంగ్ 24 గంటల్లో 2.2 మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది.

ఈ రికార్డ్ ని దేవర బ్రేక్ చేస్తే మాత్రం కచ్చితంగా అది సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు. అనిరుద్ మ్యూజిక్ కి తమిళంలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని భాషలలో కలిపి కచ్చితంగా సౌత్ ఇండియాలో హైయెస్ట్ వ్యూస్, లైక్స్ రికార్డ్ ని దేవర ఫస్ట్ సింగిల్ బ్రేక్ చేస్తుందని తారక్ అభిమానులు భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చూడాలి.