Begin typing your search above and press return to search.

కొర‌టాల నిజానికి ఇలా తీస్తే ఎంత బావుండు!

ఈ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ ఒక భారీ మాన్ స్ట‌ర్ త‌రుముకొస్తోంది. వాట‌ర్ లో దేవ‌ర వేగంగా దాని ముందు దూసుకెళుతున్న‌ట్టు క‌నిపిస్తున్న ఈ పోస్ట‌ర్ ఎంతో క్యూరియాసిటీని పెంచింది.

By:  Tupaki Desk   |   5 Sep 2023 2:30 AM GMT
కొర‌టాల నిజానికి ఇలా తీస్తే ఎంత బావుండు!
X

ఎన్టీఆర్ న‌టిస్తున్న దేవ‌ర ఫ‌స్ట్ లుక్ ఇంత‌కుముందే విడుద‌లైంది. ఇప్పుడు మ‌రో కొత్త పోస్ట‌ర్ వెబ్ ని షేక్ చేస్తోంది. ఇంత‌కీ దీనిని క్రియేట్ చేసింది ఎవ‌రో కానీ సాంకేతికంగా అత‌డి ఆలోచ‌న ఎంతో క్రియేటివ్ గా ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఈ పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ ఒక భారీ మాన్ స్ట‌ర్ త‌రుముకొస్తోంది. వాట‌ర్ లో దేవ‌ర వేగంగా దాని ముందు దూసుకెళుతున్న‌ట్టు క‌నిపిస్తున్న ఈ పోస్ట‌ర్ ఎంతో క్యూరియాసిటీని పెంచింది.


నిజానికి ఈ ఆలోచ‌న క్రియేట‌ర్ల‌కు ఎలా వ‌చ్చింది? అంటే ఇంత‌కుముందే దేవ‌ర స‌న్నివేశాల గురించి అందిన లీక్ ఒక కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. కొన్ని నీటి అడుగున సన్నివేశాలతో కూడిన భారీ వాటర్ ఛేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు దేవ‌ర‌కు VFX సూపర్‌వైజర్ ప‌ని చేస్తున్న వ్య‌క్తి వెల్ల‌డించ‌డంతో వెంట‌నే ఈ కొత్త పోస్ట‌ర్ ని రూపొందించి అభిమానులు రిలీజ్ చేసారు. దీనికోసం ఐఏ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించార‌ని భావిస్తున్నారు. నిజానికి దేవ‌ర క‌థాంశంలో ఇంత డెప్త్ ఉంది అంటే కచ్ఛితంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడ‌ని అంగీక‌రించ‌వ‌చ్చు. నిజానికి ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కంటే ఈ ఏఐ రూపొందించిన పోస్ట‌ర్ ఎంతో బాగుందని కొందరు పొగిడేస్తున్నారు.

అయితే మాన్ స్ట‌ర్ తో దేవ‌ర వార్ నేప‌థ్యంలో థీమ్ ఎంతో బావుంది కానీ కొర‌టాల శివ ఇలాంటి ఇమాజినేష‌న్ తో సినిమా తీస్తాడ‌ని అనుకోలేం. ఎన్టీఆర్ దేవ‌ర క‌చ్ఛితంగా ఒక భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ అన‌డంలో సందేహం లేదు. పాన్ ఇండియా మార్కెట్లో ఇది విడుద‌ల‌వుతుంది. ఇందులో ఎమోష‌న్స్ యాక్ష‌న్ ప్ర‌త్యేకంగా ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే ఒక భారీ రాకాసి లాంటి ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ను కొర‌టాల ప్ర‌వేశ పెడ‌తార‌ని ఇప్ప‌టికి ఎవ‌రూ ఊహించ‌లేదు. మ‌రి అలాంటి ఏదైనా స‌స్పెన్స్ ని కొర‌టాల దాచేస్తే నిజానికి థియేట‌ర్ల‌లో అది ఊహించ‌ని ట్రీట్ గా మారుతుంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. అన‌గ‌న‌గ ఒక రాకుమారుడు.. రాకుమార్తె.. మ‌ధ్య‌లో మాంత్రికుడు.. అత‌డు సృష్టించే భారీ మాన్ స్ట‌ర్ అంటూ కొర‌టాల క‌థ‌ను రాసుకునే వీలుందా? అన్న‌ది చూడాలి.