Begin typing your search above and press return to search.

దేవర.. అప్పుడే అన్ని కోట్లా?

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ దేవర

By:  Tupaki Desk   |   18 Jan 2024 4:40 AM GMT
దేవర.. అప్పుడే అన్ని కోట్లా?
X

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే డిఫరెంట్ టోన్ లో ఫిక్షనల్ కథాంశంతో ఈ మూవీని కొరటాల సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో ఈ మూవీ రిలీజ్ కానుంది. రెండు భాఘాలుగా దేవర మూవీ రానున్నట్లు ఇప్పటికే కొరటాల శివ ప్రకటించారు. జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఆమె కెరియర్ చేస్తోన్న పెద్ద బడ్జెట్ స్టార్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. దీంతో దేవర మూవీపై జాన్వీ కపూర్ చాలా హోప్స్ పెట్టుకుంది.

సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంతో ప్రతినాయకుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రీసెంట్ గా దేవర టీజర్ ని రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా ఎన్ఠీఆర్ కెరియర్ లోనే ఇదొక బెస్ట్ మూవీ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. తాజా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది.

ఈ సినిమా ఐదు భాషలకి సంబందించిన డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఏకంగా 150 కోట్లకు పైగా ఆఫర్ తో డిజిటల్ రైట్స్ ని ఆ సంస్థ దక్కించుకున్నట్లు టాక్. ఈ మూవీని 300 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు. అంటే డిజిటల్ రైట్స్ ద్వారానే కొంత పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. ఇక థీయాట్రికల్ రైట్స్ పై కూడా నిర్మాతలు భారీగానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

కచ్చితంగా థియేట్రికల్ గా 250 కోట్ల వరకు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో పాన్ ఇండియా ఇమేజ్ తారక్ కి రావడంతో కచ్చితంగా నార్త్ లో కూడా దేవర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. సైఫ్ ఆలీఖాన్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉండటంతో అక్కడ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.