Begin typing your search above and press return to search.

దేవర 2 కి సాహోతో లింక్ ఉండబోతుందా...?

కానీ షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో అక్టోబర్‌ కు వాయిదా వేస్తూ ఇటీవలే అధికారికంగా ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   5 March 2024 10:30 AM GMT
దేవర 2 కి సాహోతో లింక్ ఉండబోతుందా...?
X

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్నారు. దేవర 1 ను వచ్చే నెల ఏప్రిల్‌ లో విడుదల చేయాలని భావించారు. కానీ షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో అక్టోబర్‌ కు వాయిదా వేస్తూ ఇటీవలే అధికారికంగా ప్రకటన చేశారు.

దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. అయితే ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. అయితే తెలుగు లో ఆమె ఎంట్రీ ఇవ్వబోతున్న మొదటి సినిమాతోనే మొదటి కమర్షియల్‌ హిట్‌ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్టీఆర్‌ - జాన్వీ కపూర్‌ జోడీగా కనిపించబోతున్న దేవర సినిమాలో ప్రభాస్ తో కలిసి సాహో సినిమాలో నటించిన అందాల ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. దేవర 1 లో శ్రద్ద కపూర్ పాత్ర గెస్ట్‌ రోల్‌ అయినా, దేవర 2 లో మాత్రం ఆమెది మెయిన్ లీడ్‌ అన్నట్లుగా ఉండబోతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సాహో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయిన ముద్దుగుమ్మ శ్రద్ద కపూర్‌ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తెలుగు సినిమాల వైపు చూడలేదు. బాలీవుడ్‌ లో బిజీ బిజీగా ఉన్న శ్రద్ద కపూర్‌ దేవర 2 తో ఇన్నాళ్ల తర్వాత టాలీవుడ్‌ లో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్‌ ఎగ్జైట్‌ అవుతున్నారు.

దేవర గురించి ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు సోషల్‌ మీడియా ద్వారా షికార్లు చేస్తూ వచ్చాయి. అయితే ఈ వార్త మాత్రం కాస్త బలంగానే ప్రచారం జరుగుతోంది. మరి గతంలో వచ్చిన పుకార్ల మాదిరిగానే గాలి వార్తనా లేదంటే నిజంగానే శ్రద్ద కపూర్‌ దేవరలో ఉందా అనేది తెలియాలంటే యూనిట్‌ సభ్యుల నుంచి స్పందన రావాల్సి ఉంది.