దేవర ఖాతాలో మరో రికార్డు
అంతేకాదు ఓటీటీలో రిలీజైన టైమ్ లో గ్లోబల్ టాప్ 10 ర్యాంకింగ్స్ లో మూడు వారాల పాటూ నిలిచిన ఈ సినిమా వ్యూ అవర్స్ విషయంలోనూ మంచి నెంబర్స్ ను నమోదు చేసుకుంది.
By: Tupaki Desk | 19 July 2025 12:03 PM ISTమ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజైన ఈ సినిమా మొదట మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత మంచి కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా దేవర సినిమా ఓపెనింగ్స్ తోనే రికార్డులు బ్రేక్ చేసింది. లాంగ్ రన్ లో రూ.400 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది దేవర.
ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ గా నిలిచిన దేవర థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే దేవర సినిమా కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా సెన్సేషనల్ హిట్ ను అందుకుంది. ఓటీటీలోకి వచ్చిన కొత్తల్లో దేవర ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ టైమ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన ఇండియన్ మూవీగా కూడా దేవర నిలిచింది.
అంతేకాదు ఓటీటీలో రిలీజైన టైమ్ లో గ్లోబల్ టాప్ 10 ర్యాంకింగ్స్ లో మూడు వారాల పాటూ నిలిచిన ఈ సినిమా వ్యూ అవర్స్ విషయంలోనూ మంచి నెంబర్స్ ను నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి దేవర సినిమా వార్తల్లో నిలిచింది. తాజా అప్డేట్ ప్రకారం దేవర సినిమా 16.1 మిలియన్ వ్యూస్ తో నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా చూసిన తెలుగు సినిమాల్లో ఒకటిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఎన్టీఆర్ క్రేజ్ వల్లే దేవర సినిమా ఈ స్థాయి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు.
తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించిన దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించారు. దేవర సినిమాకు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన సంగీతం అందరినీ ఉర్రూతలూగించింది. దేవర భారీ సక్సెస్ లో అనిరుధ్ సాంగ్స్, బీజీఎం కీలక పాత్ర పోషించాయి. దేవర సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఎన్టీఆర్, ఆ సినిమాకు సీక్వెల్ గా దేవర2 కూడా చేయనున్న సంగతి తెలిసిందే.
