Begin typing your search above and press return to search.

కొన్ని క‌థ‌లు ఎప్ప‌టికీ కొత్త‌గానే ఉంటాయి

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు ఓ పిల్ల‌ర్ అయిన అక్కినేని నాగేశ్వ‌రరావు ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 11:41 AM IST
కొన్ని క‌థ‌లు ఎప్ప‌టికీ కొత్త‌గానే ఉంటాయి
X

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు ఓ పిల్ల‌ర్ అయిన అక్కినేని నాగేశ్వ‌రరావు ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. అందులో దేవ‌దాసు కూడా ఒక‌టి. 1953 జూన్ 26న రిలీజైన ఈ సినిమా నేటికి 72 ఏళ్లు పూర్తి చేసుకుంది. వేదాంతం రాఘ‌వ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వ‌రరావు స‌ర‌స‌న మ‌హాన‌టి సావిత్రి న‌టించారు.

బెంగాలీ న‌వల దేవదాస్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌గా, సినిమా అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆ సినిమాలో ఏఎన్నార్, సావిత్రి, ల‌లిత న‌ట‌న‌తో పాటూ సినిమాలోని సంగీతం కూడా విప‌రీతంగా క్లిక్ అయంది. దేవ‌దాసు సినిమా తెలుగులోనే కాకుండా త‌మిళంలో కూడా రిలీజై రెండు చోట్లా క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ అవ‌డంతో పాటూ క‌ల్ట్ స్టేట‌స్ ను అందుకుంది.

గ‌తేడాది ఏఎన్నార్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన ప‌ది సినిమాల‌ను రీరిలీజ్ చేయ‌గా అందులో దేవ‌దాసు కూడా ఒక‌టి. రీరిలీజుల్లో దేవ‌దాస్ సినిమా మంచి ఫ‌లితాన్ని అందుకుంది. దేవదాసు రిలీజై ఇవాల్టికి 72 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆ సినిమాను, అందులోని ఏఎన్నార్ యాక్టింగ్ ను గుర్తు చేసుకుంటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ ఓ స్పెష‌ల్ వీడియోను షేర్ చేసింది.

జ‌గ‌మే మాయ, బతుకే మాయ అంటూ మొద‌లైన ఆ వీడియోలో, సినిమాలోని కొన్ని క్లిప్పింగ్స్ తో పాటూ, దేవదాసు తరతరాలుగా హృదయాలను తాకే క్లాసిక్‌గా మిగిలిపోయిందని, ఇండియ‌న్ సినిమాలో ఎక్కువ సార్లు రీరిలీజైన మాస్ట‌ర్ పీస్ మూవీగా దేవ‌దాసు నిలుస్తుంద‌ని, సినిమా వ‌చ్చి ఎన్నేళ్లవుతున్నా కొన్ని క‌థ‌లు ఎప్ప‌టికీ కొత్త‌గానే ఉంటాయ‌ని ఆ వీడియో ద్వారా అన్న‌పూర్ణ స్టూడియోస్ తెలిపింది.