Begin typing your search above and press return to search.

'మయసభ' సిరీస్.. CBN,YSగా వారే కనిపించనున్నారా?

చంద్రబాబు నాయుడుగా ఆది పినిశెట్టి.. వైఎస్ రాజశేఖర రెడ్డిగా చైతన్య రావు.. ఎన్టీఆర్ గా సాయి కుమార్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 5:17 PM IST
మయసభ సిరీస్.. CBN,YSగా వారే కనిపించనున్నారా?
X

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు దేవ కట్టా.. ప్రస్తుతం మయసభ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా రానున్న ఆ సిరీస్ సీజన్ 1 షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. 400 నిమిషాల ఫుటేజ్ సిద్ధమైందని రీసెంట్ గా దేవకట్టా వెల్లడించారు. మొదటి సీజన్ ఏడు గంటల నిడివి ఉంటుందని అర్థమవుతుంది.

ఫైనల్ సౌండ్ మిక్సింగ్ జరుగుతోందని ఇటీవల ట్వీట్ చేశారు. ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయి కుమార్, నాజర్, దివ్యా దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు తదితరులు సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. చైతన్య రావు పేరును కొందరు నాగ చైతన్య అని తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

2025 చివర్లలో మయసభ సిరీస్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు సిరీస్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రముఖ రాజకీయ వేత్తలైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్ర‌స్తుత‌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూ సిరీస్ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు నాయుడుగా ఆది పినిశెట్టి.. వైఎస్ రాజశేఖర రెడ్డిగా చైతన్య రావు.. ఎన్టీఆర్ గా సాయి కుమార్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నెటిజన్లు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. సరిగ్గా వారు ముగ్గురూ సెట్ అవుతారని అభిప్రాయపడుతున్నారు. సిరీస్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అదే సమయంలో మయసభ సిరీస్.. రెండు మూడు సీజ‌న్లుగా రూపొందిస్తున్నారని సమాచారం. మొద‌టి సీజ‌న్‌ను ఈ ఏడాది చివరిలో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో అందుబాటులోకి రానున్నట్లు వినికిడి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని టాక్.

కాగా, దేవ కట్టాకు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. 2005లో డైరెక్టర్ గా పరిచయమైన ఆయన.. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశారు. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ సినిమాలే రూపొందించారు. ఆ తర్వాత ఒక్క మూవీని తీయలేదు. ఇప్పుడు మయసభ సిరీస్ తో సందడి చేయనున్నారు. మరి ఆ సిరీస్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.