ఇది విధి నిర్ణయం... శ్రీలీల గురించి భాగ్యశ్రీ కామెంట్స్ వైరల్!
అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ, సినిమా చుట్టూ ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 8 July 2026 7:37 PM ISTఅఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ, సినిమా చుట్టూ ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట శ్రీలీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఆ అవకాశాన్ని భాగ్యశ్రీ బోర్సే అందుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల చేయాల్సిన సినిమా మీకు రావడం అదృష్టంగా భావిస్తున్నారా? అనే ప్రశ్నకు భాగ్యశ్రీ ఎంతో పరిణితితో స్పందించింది.
ప్రతి కథ అందులో ఎవరు నటించాలో ముందే నిర్ణయించుకుంటుందని, ఒక పాత్ర ఎవరికి దక్కాలో అది విధే నిర్ణయిస్తుందని, లెనిన్ లో భాగం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ అవకాశం రావడం వెనుక కూడా ఆ డెస్టినీనే ఉందంటూ ఆమె చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. మరో హీరోయిన్ చేయాల్సిన పాత్ర తనకు రావడంపై ఎలాంటి పోలికలు లేకుండా, కథపై నమ్మకంతో ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
ఇక భాగ్యశ్రీ కెరీర్ పరంగా చూస్తే లెనిన్ చాలా కీలకమైన సినిమా. గత కొంతకాలంగా ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేదు. దీంతో ఈ సినిమా ఆమెకు తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా రిజల్ట్ ఆమె కెరీర్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే లెనిన్ రిలీజ్‌కు ముందే భాగ్యశ్రీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. టీజర్, ట్రైలర్‌లో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, అఖిల్‌తో కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజ్ తర్వాత ఆమె క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వస్తే, టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ లెనిన్‌పై అంచనాలను మరింత పెంచాయి. అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా ఎంత కీలకమో, భాగ్యశ్రీ కెరీర్‌కు కూడా లెనిన్ అంతే ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా మారింది. డెస్టినీ తనను ఈ సినిమాకు తీసుకొచ్చిందని చెప్పిన భాగ్యశ్రీకి, అదే డెస్టినీ సక్సెస్ ను కూడా అందిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న లెనిన్ రిజల్ట్ అఖిల్‌తో పాటు భాగ్యశ్రీ సినీ కెరీర్ కు కూడా కొత్త మలుపు తీసుకురానుందేమో చూడాలి.
