Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ పార్ట్‌ 3 పనులు షురూ

రెండో పార్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మూడో పార్ట్‌ను అంతకు మించిన బడ్జెట్‌తో రూపొందించే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 April 2025 4:00 AM IST
సూపర్‌ హిట్‌ పార్ట్‌ 3 పనులు షురూ
X

సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది చాలా కామన్‌గా జరుగుతున్న విషయం. అయితే రెండో పార్ట్‌ వరకు ఓకే కానీ మూడో పార్ట్‌ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. హర్రర్‌, థ్రిల్లర్‌ సినిమాలకు రెండో పార్ట్‌తో ఆగి పోకుండా మూడో పార్ట్‌, నాల్గవ పార్ట్‌ అంటూ ప్రాంచైజీని మొదలు పెడుతున్న వారు చాలా మంది ఉన్నారు. తమిళ్‌లో రూపొందిన 'డీమాంటీ కాలనీ' సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఆ సినిమాను ఓటీటీ, టీవీల ద్వారా తెలుగు ఇతర భాషల్లోనూ ప్రేక్షకులు చూసి సక్సెస్ చేశారు.

డీమాంటీ కాలనీ సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో గత ఏడాది పార్ట్‌ 2 వచ్చింది. 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీమాంటీ కాలనీ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సీక్వెల్‌కు రూ.85 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయని సమాచారం. తమిళ్‌తో పాటు తెలుగులోనూ సినిమా విడుదల అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది. థియేట్రికల్‌ రిలీజ్‌తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ డీమాంటీ కాలనీ ఆకట్టుకుంది. దాంతో మూడో పార్ట్‌ను రూపొందించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే రెండో పార్ట్‌ మాదిరిగా ఆలస్యం చేయకుండా మూడో పార్ట్‌ను వెంటనే తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

కోలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 'డీమాంటీ కాలనీ' మూడో పార్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలోనే మూడో పార్ట్‌ సైతం రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. నటీ నటుల విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటి రెండు పార్ట్‌ల్లోనూ అరుళ్‌ నిధినే ముఖ్య పాత్రలో నటించాడు. కనుక మూడో పార్ట్‌లో ఆయన నటించే అవకాశాలు ఉన్నాయి. అయితే హీరోయిన్‌ ఇతర నటీ నటుల పాత్రల్లో నటించే వారు మారే అవకాశాలు ఉన్నాయి. మూడో పార్ట్‌ను మరీ ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మొదటి పార్ట్‌తో పోల్చితే రెండో పార్ట్‌ బడ్జెట్‌ను పెంచారు. రెండో పార్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మూడో పార్ట్‌ను అంతకు మించిన బడ్జెట్‌తో రూపొందించే అవకాశాలు ఉన్నాయి. రెండో పార్ట్‌ బడ్జెట్‌ రూ.20 కోట్లు కాగా మూడో పార్ట్‌ బడ్జెట్‌ను దాదాపుగా రూ.50 కోట్లుగా అనుకుంటున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేసి, నటీనటులను ఎంపిక చేసిన తర్వాత బడ్జెట్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డీమాంటీ కాలనీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో సీక్వెల్‌కి రూ.50 కోట్ల బడ్జెట్‌ కచ్చితంగా వర్కౌట్‌ అవుతుంది అనే అభిప్రాయంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.