Begin typing your search above and press return to search.

పుట్టా పున‌ర్వ‌సు గ‌డియ‌ల్లో...న‌డుస్తా రామ‌య్య లెవ‌ల్లో!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌-మృణాళ్ ఠాకూర్ జంట‌గా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'ఫ్యామిలీ స్టార్' పాట‌ల సంద‌డి మొద‌లైన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 April 2024 5:27 PM GMT
పుట్టా పున‌ర్వ‌సు గ‌డియ‌ల్లో...న‌డుస్తా రామ‌య్య లెవ‌ల్లో!
X

విజ‌య్ దేవ‌ర‌కొండ‌-మృణాళ్ ఠాకూర్ జంట‌గా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'ఫ్యామిలీ స్టార్' పాట‌ల సంద‌డి మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఒక్కో లిరిక‌ల్ సాంగ్ శ్రోత‌ల్ని అల‌రిస్తుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మూడు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఫోర్త్ సింగిల్ కూడా కాసేప‌టి క్రితమే రిలీజ్ అయింది. 'దేఖోరే దేఖో' అంటూ సాగే సాంగ్ ప్రారంభం కాస్త మాస్ గా అనిపించినా అటుపై గోపీ మార్క్ మెలోడీ ట్రాక్ సంగీత ప్రియుల్ని లాక్ చేయ‌డం ఖాయం.

'పుట్టాను నేను అలా నేను ప‌న‌ర్వ‌సు గ‌డియ‌ల్లో..రామ‌య్యా లెవ‌ల్లో న‌డుస్తాను ప్ర‌తీ దానిలో క‌మిట్ మెంట్ లో డిటో సేమ్ డిటో' అంటూ సాగుతుంది. సినిమాలో హీరో పాత్ర తీరును వివ‌రిస్తూ రాసిన పాట ఇది. హీరోకి మంచి ఇంట‌ర్ డ‌క్ష‌న్ సాంగ్ లా ఉంది. ఈ పాట‌కి అనంత శ్రీరామ్ సాహిత్యం స‌మ‌కూర్చ‌గా.. గోపీ సుంద‌ర్ మెలోడీ ట్యూన్ తో శ్రోత‌ల‌కి ఈజీగా క‌నెక్ట్ అవుతుంది. విన‌డానికి విన‌సొంపుగానూ ఉంది. పాట‌లో విజ‌య్ స్మార్ట్ గాళ్స్ ఫిదా అవుతారు. గోపీ సుంద‌ర్ సంగీతంతో మ‌రోసారి సంగీత ప్రియుల్ని మాయ చేసేస్తాడు.

గీత‌గోవిందం చిత్రానికి కూడా గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. అందులో ప్ర‌తీపాట శ్రోత‌ల‌కి బాగా క‌నెక్ట్ అయింది. ఫ్యామిలీ స్టార్ పాట‌ల‌కు అదే లెవ‌ల్లో రెస్పాన్స్ వ‌స్తోంద‌న్న ధీమాని టీమ్ వ్య‌క్తం చేస్తుంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. కంటెంట్ లో గీత‌గోవిందం ప్లేవ‌ర్ క‌నిపించ‌డంతో? సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది.

'గీత‌గోవిందం'లో హీరోపాత్ర‌ని సాప్ట్ గా చూపించినా 'ఫ్యామిలీ స్టార్' లో మాత్రం సాప్ట్ యాంగిల్ తో పాటు మాస్ విజ‌య్ ని హైలైట్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అన్ని ప‌నులు పూర్తి చేసి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.