Begin typing your search above and press return to search.

17 వ‌య‌సులో దీపిక‌ ఎంత పెద్ద సాహ‌సం!

పదిహేడు అనేది చాలా మందికి తమ కల ఏంటో కూడా గ్రహించలేని వయస్సు.

By:  Tupaki Desk   |   10 April 2024 5:19 AM GMT
17 వ‌య‌సులో దీపిక‌ ఎంత పెద్ద సాహ‌సం!
X

పదిహేడు అనేది చాలా మందికి తమ కల ఏంటో కూడా గ్రహించలేని వయస్సు. ఇంత లేత వయస్సులో దీపిక ప‌దుకొనే తన కలలను నిజం చేసుకునేందుకు సాహ‌సాలు చేసింది. గ‌ట్స్ ప్ర‌ద‌ర్శించింది. బెంగ‌ళూరు నుంచి ముంబైకి చేరుకుంది. అక్క‌డ ఒక చిన్న గ‌దిలో సావాసం చేసింది. తన కంఫర్ట్ జోన్, తన ఇంటిని వదిలి ముంబైకి వెళ్లాలని కఠినమైన నిర్ణ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల‌నే ఈ రోజు ఈ స్థాయికి చేరుకుంది. మోడల్ గా రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తూనే సినిమాల్లో అవ‌కాశం కోసం ప్ర‌య‌త్నించాన‌ని, చివ‌రికి త‌న‌ను ఫరా ఖాన్ గుర్తించి, షారూఖ్ ఖాన్ సరసన `ఓం శాంతి ఓం`లో అవ‌కాశం క‌ల్పించార‌ని గుర్తు చేసుకున్నారు. తొలి సినిమా ఆఫ‌ర్ వ‌చ్చే వ‌ర‌కూ చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని దీపిక తెలిపారు. త‌న‌కు నివ‌శించ‌డానికి చిన్న గ‌ది కూడా లేదు. ఆ స‌మ‌యంలో ఎక్కువ‌గా సెట్స్ లోనో లేక ఆరు బ‌య‌ట ఎక్క‌డో ఒక చోట గ‌డిపేసేదానిని అని కూడా తెలిపింది.


తన పెద్ద కలను నెర‌వేర్చుకునేందుకు, సెల‌బ్రిటీగా జీవించడానికి ముంబైకి వెళ్లాలనే తన నిర్ణయంపై దీపిక మ‌రోసారి ఇప్పుడు గుర్తు చేసుకుంది. నేను 17 ఏళ్ళ వయసులో తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచించినప్పుడు, కొన్నిసార్లు అది నేనేనా? అని అనుకుంటాను. నేను ఆ నిర్ణయం ఎలా తీసుకున్నాను? ఆ సమయంలో అది ఎంత పెద్ద నిర్ణయం? అనేది నేను ఎలా గ్రహించలేకపోయాను? కానీ ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని దీపిక అన్నారు.

దీపికా తండ్రి .. మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణె కూడా త‌న కుమ‌ర్తె నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని అంగీక‌రించారు. ప్రేమగల శ్రద్ధగల తల్లితండ్రులుగా ఉంటూ.. త‌న‌కు కానీ, త‌న కుమార్తెకు కానీ నివసించడానికి స్థలం లేని పెద్ద నగరానికి ఒంటరిగా వెళ్లనివ్వడం సాహ‌స‌మేన‌ని ఆయ‌న భావించారు. ``దీపిక‌కు 18 ఏళ్లు కూడా లేవు కాబట్టి మేము చాలా భయాందోళనలకు గురయ్యాము. ఆమెకు ఉండడానికి చోటు లేదు. పైగా కొత్త రంగంలోకి వెళుతోంది. ఆ సమయంలో త‌ను బయటికి వెళ్లడానికి చాలా చిన్నదని మాకు అనిపించింది. కానీ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే త‌ను చేసింది సరైన పని అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ వృత్తిలో ఎవ‌రైనా చాలా ముందుగానే ప్రారంభ‌మ‌వ్వాలి`` అని ప్రకాష్ పదుకొణె అన్నారు.

దీపిక తన తల్లిదండ్రుల భయాన్ని ఆందోళనను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది. అయితే అప్ప‌ట్లో అది చాలా ముఖ్య‌మైన నిర్ణ‌యం.. అందుకే సాహ‌సించాన‌ని దీపిక అన్నారు. దీపికా పదుకొణె పరిశ్రమలో అత్యంత అందమైన, ప్రతిభావంతురాలైన, నిర్మాత‌లు న‌మ్మ‌దగిన స్టార్ హీరోయిన్‌ గా ఎదిగారు. తన ప్రియుడు ర‌ణ‌వీర్ సింగ్ ని పెళ్లాడి హ్యాపీ లైఫ్ ని ఆస్వాధిస్తోంది. త్వరలో ఈ జంట తమ మొదటి బిడ్డకు జ‌న్మ‌నివ్వ‌బోతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.