Begin typing your search above and press return to search.

మరో ప్ర‌ఖ్యాత వేదిక‌పై దీపిక మెరుపులు

ఐశ్వ‌ర్యారాయ్ సినిమాలు త‌గ్గించిన త‌ర్వాత‌..ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ స్టార్ గా ఫేమ‌స్ అయిన త‌ర్వాత దీపికా ప‌దుకొణే ఎక్కువ‌గా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 1:06 PM
మరో ప్ర‌ఖ్యాత వేదిక‌పై దీపిక మెరుపులు
X

అంతర్జాతీయ వేదిక‌ల‌పై అత్య‌ధికంగా మెరిస‌న భామ‌లు ఎవ‌రంటే? ఐశ్వ‌ర్యారాయ్...ప్రియాంక చోప్రా క‌నిపిస్తుంటారు. ఎలాంటి ఉత్స‌వాల్లోనైనా వాళ్లిద్ద‌రు త‌ప్ప‌కుండా పాల్గొంటారు. ఆ భామ‌లిద్ద‌రికీ స‌ముచిత స్థానం క‌ల్పించ‌డం అన్న‌ది ఎప్ప‌టి నుంచో జ‌రుగుతోంది. మ‌రి ఆ త‌ర్వాత స్థానంలో భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ నుంచి నిలిచింది ఎవ‌రంటే? క‌చ్చితంగా దీపికా ప‌దుకొణే పేరు చెప్పాల్సిందే.


ఐశ్వ‌ర్యారాయ్ సినిమాలు త‌గ్గించిన త‌ర్వాత‌..ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ స్టార్ గా ఫేమ‌స్ అయిన త‌ర్వాత దీపికా ప‌దుకొణే ఎక్కువ‌గా అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఎలాంటి ఉత్స‌వాల్లోనైనా దీపిక పేరు చాలా కామ‌న్ గా మారిపోయింది. విదేశీ భామ‌ల స‌ర‌స‌న సైతం దీపిక‌కి ఓ కూర్చీ వేసి గొప్ప గౌర‌వాన్ని ఎన్నో వేదిక‌లు క‌ల్పించాయి. తాజాగా ప్ర‌ఖ్యాత ఆస్కార్ అవార్డు వేడుక‌ల్ని నిర్వ‌హించే అకాడమీ ఆఫ్ మ్యూజియం గాలా అవార్డుల కార్య‌క్ర‌మంలో దీపికా ప‌దుకొణే పాల్గొన్నారు.


ఆకాడ‌మీ ఆఫ్ మ్యూజియం బోర్డు నిర్వహించే రెండవ అతిపెద్ద వేదిక ఇదే. ఇందులో దీపిక‌కి స్థానం ద‌క్క‌డం గొప్ప విశేషంగానే చెప్పాలి. ఇంత‌వర‌కూ ఏ భార‌తీయ న‌టి ఈ వేడుక‌లో పాల్గొన‌లేదు. ఆ ర‌కంగా దీపిక తొలిసారి గాలా వేదిక‌పైనా మెరిసి రికార్డు సృష్టించింది. భార‌తీయ పరిశ్ర‌మ ఔన్న‌త్యాన్ని చాట‌డానికి మ‌రో గొప్ప వేదిక‌గా ఇది నిలిచింది. దీపిక ఈ అవకాశాన్ని ఎంతో చ‌క్క‌గా స‌ద్వినియోగం చేసుకున్నారు.


ఇందులో అమ్మ‌డు ప్ర‌త్యేక డిజైన‌ర్ దుస్తుల్లో మెరిసారు. బ్లూ క‌ల‌ర్ ముకుముల్ల ఔట్ ఫిట్ లో ఎంతో అందంగా ముస్తాబ‌య్యారు. అమ్మ‌డు మ్యాక‌ప్ అయిన విధానం.. ఎంపిక చేసుకున్న యాక్స‌ర సీస్. .పెదాల‌పై అంద‌మైన న‌వ్వు దీపిక‌ని మ‌రింత అందంగా తీర్చి దిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. గాలా వేదిక‌పై త‌ళుక్కున మెర‌వ‌డంతో దీపికని ప్ర‌త్యేకంగా ట్రీట్ చేసి విషెస్ తెలియ‌జేస్తున్నారు.