Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడి టాటూ వ‌దిలించుకున్న పెళ్ల‌యిన నటి!

ఎట్ట‌కేల‌కు ఈ క‌ఠిన‌మైన‌ టాటూ మ‌చ్చ‌ మాయం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఎపిసోడ్ లో ఆమె ఎవ‌రు?

By:  Tupaki Desk   |   14 April 2024 4:55 AM GMT
మాజీ ప్రియుడి టాటూ వ‌దిలించుకున్న పెళ్ల‌యిన నటి!
X

ఆమె అత‌డిని ఘాడంగా ప్రేమించింది. ఔటింగులు, షికార్ల‌తో నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలిచింది. కానీ చివ‌రికి ల‌వ్ బ్రేక‌ప్ అయింది. అత‌డు వేరొక హీరోయిన్ తో ఎఫైర్ సాగించ‌డ‌మే దీనికి కార‌ణం. ఆ త‌ర్వాత ఆమెకు ఒక ప్ర‌ముఖ హీరో ప్ర‌పోజ్ చేసాడు. అనంత‌రం ఈ జంట ప్రేమాయ‌ణం, పెళ్లి ప‌బ్లిక్‌కి తెలిసిన వ్య‌వ‌హారాలే.

అయితే మొద‌టి ప్రియుడితో నిండా ప్రేమ‌లో మునిగాక అత‌డి పేరును త‌న వీపు భాగంలో మెడ‌కు దిగువ‌గా టాటూ కూడా వేయించుకుంది. అయితే ఆ టాటూని చెరిపేయ‌డం త‌న వ‌ల్ల కాలేదు. చివ‌రికి వేరొకరితో పెళ్ల‌యినా ఆ టాటూని చెరిపేయడం సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. చాలా ప్ర‌య‌త్నాలు చేసినా కూడా చివ‌రికి విఫ‌ల‌మైంది. ఎట్ట‌కేల‌కు ఈ క‌ఠిన‌మైన‌ టాటూ మ‌చ్చ‌ మాయం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఎపిసోడ్ లో ఆమె ఎవ‌రు? అంటే అగ్ర క‌థానాయిక‌ దీపిక ప‌దుకొనే గురించే ఇదంతా. ర‌ణ‌బీర్ తో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యాక‌, దీపిక మ‌రో స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్- దీపిక మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉన్న జంట‌. అందుకే అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న‌తో ముందుకు సాగుతున్నారు.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. దీపికా పదుకొణె త్వరలో తల్లి కాబోతోంది. ఇటీవ‌ల ర‌ణ‌వీర్ ఎక్కడికి వెళ్లినా దీపిక గ‌ర్భ‌ధార‌ణ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. ప్ర‌స్తుతం దీపిక గ‌ర్భ‌ధార‌ణ ప్రారంభ ద‌శ‌. ఇటీవ‌ల ఓ వెకేష‌న్ లో ఈ విష‌యం బ‌హిర్గ‌త‌మైంది. ఎట్ట‌కేల‌కు దీపిక వీపు భాగంలోని RK (ర‌ణ‌బీర్ క‌పూర్ షార్ట్ క‌ట్) టాటూ కనిపించకపోవడంతో నెటిజ‌నుల్లో కామెంట్స్ ప‌డిపోతున్నాయ్. దీపిక టాటూ తొలగించింది అనే టాపిక్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆమె అత‌డిని ఘాడంగా ప్రేమించింది. ఔటింగులు, షికార్ల‌తో నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలిచింది. కానీ చివ‌రికి ల‌వ్ బ్రేక‌ప్ అయింది. అత‌డు వేరొక హీరోయిన్ తో ఎఫైర్ సాగించ‌డ‌మే దీనికి కార‌ణం. ఆ త‌ర్వాత ఆమెకు ఒక ప్ర‌ముఖ హీరో ప్ర‌పోజ్ చేసాడు. అనంత‌రం ఈ జంట ప్రేమాయ‌ణం, పెళ్లి ప‌బ్లిక్‌కి తెలిసిన వ్య‌వ‌హారాలే.

అయితే మొద‌టి ప్రియుడితో నిండా ప్రేమ‌లో మునిగాక అత‌డి పేరును త‌న వీపు భాగంలో మెడ‌కు దిగువ‌గా టాటూ కూడా వేయించుకుంది. అయితే ఆ టాటూని చెరిపేయ‌డం త‌న వ‌ల్ల కాలేదు. చివ‌రికి వేరొకరితో పెళ్ల‌యినా ఆ టాటూని చెరిపేయడం సాధ్య‌ప‌డ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. చాలా ప్ర‌య‌త్నాలు చేసినా కూడా చివ‌రికి విఫ‌ల‌మైంది. ఎట్ట‌కేల‌కు ఈ క‌ఠిన‌మైన‌ టాటూ మ‌చ్చ‌ మాయం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఎపిసోడ్ లో ఆమె ఎవ‌రు? అంటే అగ్ర క‌థానాయిక‌ దీపిక ప‌దుకొనే గురించే ఇదంతా. ర‌ణ‌బీర్ తో ల‌వ్ బ్రేక‌ప్ అయ్యాక‌, దీపిక మ‌రో స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ‌వీర్- దీపిక మంచి అండ‌ర్ స్టాండింగ్ ఉన్న జంట‌. అందుకే అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న‌తో ముందుకు సాగుతున్నారు.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. దీపికా పదుకొణె త్వరలో తల్లి కాబోతోంది. ఇటీవ‌ల ర‌ణ‌వీర్ ఎక్కడికి వెళ్లినా దీపిక గ‌ర్భ‌ధార‌ణ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. ప్ర‌స్తుతం దీపిక గ‌ర్భ‌ధార‌ణ ప్రారంభ ద‌శ‌. ఇటీవ‌ల ఓ వెకేష‌న్ లో ఈ విష‌యం బ‌హిర్గ‌త‌మైంది. ఎట్ట‌కేల‌కు దీపిక వీపు భాగంలోని RK (ర‌ణ‌బీర్ క‌పూర్ షార్ట్ క‌ట్) టాటూ కనిపించకపోవడంతో నెటిజ‌నుల్లో కామెంట్స్ ప‌డిపోతున్నాయ్. దీపిక టాటూ తొలగించింది అనే టాపిక్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెగ్నెన్సీ కార‌ణంగా దీపిక ఇటీవ‌ల సినిమాల‌కు క‌మిట్ కాని సంగ‌తి తెలిసిందే.