Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్టార్ కపుల్‌ వాలంటైన్స్ డే స్పెషల్‌

వైట్ కలర్‌ డ్రెస్ లో దీపికా పదుకునే ను ఈ ఫోటోలో చూడవచ్చు. రణ్‌వీర్ సింగ్ కూడా ఆమెకు మ్యాచ్ అయ్యే విధంగా లైట్ కలర్ పాంట్ తో వైట్‌ షర్ట్‌ ను ధరించి కన్నుల విందు చేశారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 5:53 AM GMT
పిక్ టాక్ : స్టార్ కపుల్‌ వాలంటైన్స్ డే స్పెషల్‌
X

ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల సందడి అంతా ఇంతా కాదు. చాలా మంది స్టార్స్ కూడా తమ జీవిత భాగస్వామితో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేయడం జరిగింది. ఇక కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ మరియు వీడియోలను ఫిల్మ్ మేకర్స్ వాలంటైన్స్ డే సందర్భంగా తీసుకు వచ్చారు.

బాలీవుడ్ లో మోస్ట్‌ బ్యూటీపుల్‌ కపుల్‌ గా పేరు దక్కించుకున్న రణ్‌వీర్‌ సింగ్ మరియు దీపికా పదుకొణె లు తమ వాలంటైన్స్ డే ను ప్రత్యేకంగా జరుపుకోలేదు. ఈ ప్రత్యేక రోజు కూడా వారిద్దరు షూటింగ్‌ లో ఉన్నారు. ఆ షూటింగ్‌ స్పాట్‌ లో తీసుకున్న ఫోటోను ప్రేక్షకులతో షేర్‌ చేసుకున్నారు.

వైట్ కలర్‌ డ్రెస్ లో దీపికా పదుకునే ను ఈ ఫోటోలో చూడవచ్చు. రణ్‌వీర్ సింగ్ కూడా ఆమెకు మ్యాచ్ అయ్యే విధంగా లైట్ కలర్ పాంట్ తో వైట్‌ షర్ట్‌ ను ధరించి కన్నుల విందు చేశారు. ఈ జోడీ ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందని, జీవితాంతం వీరు ఇలా సంతోషంగా కలిసి ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ మధ్య వీరిద్దరు విడి పోయారు అంటూ పుకార్లు సోషల్‌ మీడియాలో షికార్లు చేశాయి. కానీ అవి గాలి వార్తలే అని స్వయంగా వీరిద్దరు తమ యొక్క ఫోటోలు మరియు వీడియోలతో నిరూపించారు. ఇద్దరు కలిసి సింబ సీక్వెల్‌ లో నటించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక దీపికా పదుకునే బాలీవుడ్‌ లోనే కాకుండా సౌత్‌ లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ప్రస్తుతం ప్రభాస్‌ తో కల్కి సినిమాలో నటిస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న కల్కి సినిమాలో దీపికా లుక్ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. కల్కి తర్వాత సౌత్‌ లో దీపికా మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి.