Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ K - దీపికా ఎందుకు దూరమైనట్లు?

అందుకే దీపికా ఈ ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్​ లాంఛ్, శాన్ డీగో కామిక్ ఈవెంట్​కు హాజరు కావడం లేదు.

By:  Tupaki Desk   |   19 July 2023 10:06 AM GMT
ప్రాజెక్ట్ K - దీపికా ఎందుకు దూరమైనట్లు?
X

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' టైటిల్ గ్లింప్స్​ను.. ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్​లో గ్రాండ్​గా లాంఛ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ గ్రాండ్​ ఈవెంట్ కోసం ప్రభాస్, రానా, యూనివర్సల్​ స్టార్​ కమల్ హాసన్ అక్కడికి చేరుకున్నారు. అయితే చిత్రంలో హీరోయిన్​గా నటిస్తున్న దీపికా పదుకొణె మాత్రం ఈ ఈవెంట్​కు వెళ్లట్లేదని తెలిసింది. దీని వెనక బలమైన కారణమే ఉంది.

ప్రస్తుతం హాలీవుడ్​లో నటీనటుల సమ్మె జరుగుతున్న తెలిసిందే. దీంతో షూటింగ్​లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి. అదేంటి హాలీవుడ్​లో నిరసనలు జరగడానికి.. దీపిక ఈవెంట్​కు వెళ్లకపోవడానికి కారణమేంటని ఆలోచిస్తున్నారా? విషయంలోకి వెళితే.. ప్రస్తుతం అక్కడ సమ్మె చేస్తున్నది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ మెంబర్స్​. ఈ ఫెడరేషన్​లో దీపిక కూడా ఓ మెంబర్​.

సమ్మెలో పాల్గొన్న సభ్యులంతా.. సినిమా షూటింగులకు, అలాగే వాటికి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లలోనూ పాల్గొన కూడదు. అందుకే దీపికా ఈ ప్రాజెక్ట్ కె టైటిల్ గ్లింప్స్​ లాంఛ్, శాన్ డీగో కామిక్ ఈవెంట్​కు హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలిపినట్లు ఇంగ్లీష్ వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ సమ్మెకు బాలీవుడ్​భామ ప్రియాంకా చోప్రా కూడా మద్దతు తెలిపింది.

"స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ స్ట్రైక్ జరుగుతుండటం వల్ల నటీనటులు ఎవరూ ప్రమోషనల్ ఈవెంట్స్​ లేదా షూటింగ్​లో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నాయి. శాన్ డీగో కామిక్ కాన్ లాంటి భారీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదు. అందుకే దీపిక ఈ శాన్​ డీగో ఈవెంట్​కు హాజరు అవ్వడం లేదు" అని ఇంగ్లీష్ కథనాలు రాస్తున్నాయి.

కాగా, 2017లోనే స్టార్ యాక్టర్​ విన్ డీజిల్​తో కలిసి 'ట్రిపుల్ ఎక్స్' సినిమా ద్వారా అరంగేట్రం చేసింది దీపిక. ఆ సమయంలోనే ఈ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఫెడరేషన్​లో సభ్యత్వం తీసుకుంది. ప్రస్తుతం ఈ భామ ప్రాజెక్​ కెతో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. హృతిక్ రోషన్​​తో 'ఫైటర్​', బాద్​ షా షారుక్​ ఖాన్​తో కలిసి 'జవాన్'​లో నటిస్తోంది.