Begin typing your search above and press return to search.

సింగం నవ్వుతుంటే మరీ సిల్లీగా ఉంది రోహిత్ భయ్యా...!

తమిళ్ లో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పోలీస్ చిత్రం సింగం. తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా సింగం సినిమా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Oct 2023 7:39 AM GMT
సింగం నవ్వుతుంటే మరీ సిల్లీగా ఉంది రోహిత్ భయ్యా...!
X

తమిళ్ లో రూపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పోలీస్ చిత్రం సింగం. తెలుగు మరియు ఇతర భాషల్లో కూడా సింగం సినిమా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సౌత్ సింగం ను హిందీ ప్రేక్షకుల ముందుకు దర్శకుడు రోహిత్ శెట్టి తీసుకు వెళ్లాడు. తమిళ్లో మాదిరిగానే హిందీలో కూడా సింగం మంచి సక్సెస్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసింది. అందుకే ఇప్పుడు సింగం టైటిల్ ని ఉపయోగించుకొని కమర్షియల్ గా సక్సెస్ అవ్వాలని ఉద్దేశంతో లేడీ సింగం అనే సినిమాను కమర్షియల్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించాడు.


గతంలో ఎన్నో వందల కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాలను అందించిన ఈ కమర్షియల్ చిత్రాల దర్శకుడు ఈ మధ్యకాలంలో ఫామ్ కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాడు. తమిళ దర్శకుల మాదిరిగా ఈయన ఆలోచిస్తాడు అనే ఒక టాక్ ఉంది అందుకే హిందీ మాస్ ప్రేక్షకులు ఈయన సినిమాలకు గతంలో బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బ్యాక్ టు బ్యాక్ ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనేతో లేడీ సింగం సినిమాని రూపొందిస్తున్నాడు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన రోహిత్ శెట్టి విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సింగం సినిమా కూడా ప్రేక్షకులను మొదటి నుండి చివరి వరకు అలరించింది అనడంలో సందేహం లేదు. కానీ లేడీ సింగం ఫస్ట్ లుక్ తోనే విమర్శలని ఎదుర్కొంటుంది. ఫస్ట్ లుక్ లో దీపికా పడుకొనేను గన్ తో స్టైలిష్ గా చూపించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఆ క్రమంలో దీపిక పదుకొనేను నవ్వుతున్నట్లుగా చూపించి విమర్శల పాలయ్యాడు.

సింగం నవ్వడం ఏంటి భయ్యా అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. లేడీ సింగం అయినంత మాత్రాన నవ్వేస్తుందా అన్నట్లుగా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సింగం పవర్ తక్కువ అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. మరి కొందరు గన్ తో కాకుండా నవ్వుతూ ఈ సింగం చంపేస్తే ఎలా ఉందని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి లేడీ సింగం కాస్త ఫన్నీ సింగం అయిపోయింది. మరి సినిమా విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.