Begin typing your search above and press return to search.

ఈ శుభ‌వార్త స‌రే కానీ 'క‌ల్కి' సంగ‌తేంటి?

ఒక శుభ‌వార్త చాలా మంచి విష‌యాల‌ను మోసుకు వ‌స్తుంది. కానీ అదే మంచి వార్త కొంద‌రిలో టెన్ష‌న్ కి కూడా కార‌ణ‌మ‌వుతుంది

By:  Tupaki Desk   |   29 Feb 2024 9:30 AM GMT
ఈ శుభ‌వార్త స‌రే కానీ క‌ల్కి సంగ‌తేంటి?
X

ఒక శుభ‌వార్త చాలా మంచి విష‌యాల‌ను మోసుకు వ‌స్తుంది. కానీ అదే మంచి వార్త కొంద‌రిలో టెన్ష‌న్ కి కూడా కార‌ణ‌మ‌వుతుంది. ఇప్పుడు దీపిక ప‌దుకొనే శుభ‌వార్త చెప్పింది. తాను సెప్టెంబ‌ర్ లో మొద‌టి బిడ్డ‌ను ప్ర‌స‌వించ‌బోతున్నాన‌ని సోష‌ల్ మీడియాల్లో నిగూఢ‌మైన పోస్ట్ చేసింది. ర‌ణ‌బీర్ - దీపిక జంట త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఇది స్టార్ క‌పుల్ ఇంట‌ శుభ‌త‌రుణం.

కానీ అదే స‌మ‌యంలో దీపిక న‌టిస్తున్న ప్ర‌స్తుత సినిమాల గురించి ఒక ప్ర‌శ్న త‌లెత్తుతుంది. దీపిక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసేసిన వాటికి ప్ర‌చార‌కార్య‌క్ర‌మాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక‌వేళ షూటింగ్ పూర్తి చేయ‌క‌పోతే పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించి రిలీజ్ ముందు ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది.

అయితే ప్ర‌భాస్ - దీపిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న `క‌ల్కి 2898 AD` చిత్రీక‌ర‌ణ ఎంత‌వ‌ర‌కూ పూర్త‌యింది? అనేదాని గురించిన పూర్తి స‌మాచారం కానీ, ఇందులో దీపిక పాత్ర చిత్ర‌ణ పూర్త‌యిందా లేదా? అనే దానిపై కానీ వివ‌రాలు ఏవీ లేవు. గ‌ర్భ‌ధార‌ణ క‌న్ఫ‌ర్మేషన్ ని బ‌ట్టి దీపిక ప్ర‌తిదీ ప్లాన్ చేసి ఉంటుంద‌ని ప్ర‌స్తుతం అంతా భావిస్తున్నారు. అంటే క‌ల్కిలో త‌న పాత్ర చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యి ఉండాలి. అలా జ‌రిగితే షూటింగుల‌కు టెన్ష‌న్ లేదు. త‌దుప‌రి ఆమె ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే స‌రిపోతుంది.

ఈ సెప్టెంబ‌ర్ లో మొద‌టి బిడ్డ‌ను ప్ర‌స‌వించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది కాబ‌ట్టి మేలో విడుద‌ల కానున్న క‌ల్కి ప్ర‌మోష‌న్స్ కి దీపిక అటెండ‌వ్వాల్సి ఉంటుంది. ప్ర‌స‌వానికి నాలుగు నెల‌ల ముందు చురుగ్గా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌డం కుదురుతుందా? అన్న‌ది స‌స్పెన్స్. నిజానికి స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే ప్ర‌చారంతో హిందీ బెల్ట్ లో క‌ల్కి చిత్రానికి భారీ మైలేజ్ ద‌క్కుతుంది. దీపిక‌, అమితాబ్ ఇరువురూ `క‌ల్కి` చిత్రానికి ఉత్త‌రాదిన ప‌ద్ద ప్ల‌స్ గా నిలుస్తారు. కానీ ఇప్పుడు దీపిక చెప్పిన శుభ‌వార్త‌తోనే చిక్కులు ఉంటాయ‌ని భావిస్తున్నారు. కానీ క‌ల్కి బృందానికి ప్ర‌తిదీ అనుకూలంగా మారుతుంద‌నే ఆశిద్దాం.