Begin typing your search above and press return to search.

దీపికా అతడికి ఓకే చెప్పేనా?

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే ఇప్పటికే సౌత్ లో ప్రభాస్ కి జోడీగా కల్కి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   26 Jan 2024 11:30 PM GMT
దీపికా అతడికి ఓకే చెప్పేనా?
X

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే ఇప్పటికే సౌత్ లో ప్రభాస్ కి జోడీగా కల్కి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ తో పాటు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న దీపికా తో మరిన్ని సౌత్‌ సినిమాలు చేయించాలని ఇక్కడి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తమిళ స్టార్‌ హీరో శింబు కు జోడీగా దీపికా పదుకునేను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్ బ్యానర్‌ లో శింబు హీరోగా దేశింగు పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతోంది. ఆ సినిమాలో శింబు హీరోగా మరియు విలన్ గా కనిపించబోతున్నాడని సమాచారం.

హీరో పాత్రకు కీర్తి సురేష్ ను జోడీగా నటింపజేయబోతున్నారని, ఇక విలన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ బ్యూటీ ని ఎంపిక చేయాలని మొదటి నుంచి అనుకున్నారట. దీపికా పదుకునే ను సంప్రదించారని సమాచారం అందుతోంది. అయితే శింబుతో నటించేందుకు దీపికా ఓకే చెబుతుందా అనేది మాత్రం అనుమానం.

బాలీవుడ్‌ లో నెం.1 హీరోయిన్‌ దీపికా అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్‌ ఇండియా స్టార్ అవ్వడం వల్ల ప్రభాస్ కు జోడీగా కల్కి సినిమా లో నటించేందుకు దీపికా ఓకే చెప్పి ఉంటుంది. మరి శింబు సినిమాలో ఆమె నటించేందుకు ఓకే చెప్పడం అనేది సాధ్యం కాకపోవచ్చు.

దర్శకుడు కథ చెప్పి మెప్పిస్తే అప్పుడు దీపికా ఏమైనా ఆలోచించేనా చూడాలి. హీరోయిన్‌ గా ఆమె డిమాండ్‌ చేసే పారితోషికం కూడా చాలా ఎక్కువ. కనుక శింబు సినిమా మేకర్స్ ఆమె స్థాయి పారితోషికం ఇచ్చేనా అనేది అనుమానమే అంటూ తమిళ మీడియా వర్గాల టాక్‌.

శింబు సినిమాలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్‌ అనేది కన్ఫషర్మ్‌ అయ్యింది. మరో హీరోయిన్‌ గా దీపికా ఓకే చెప్పిందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.