Begin typing your search above and press return to search.

పుట్టింటికి 'కల్కి' హీరోయిన్‌..!

సాధారణంగా స్టార్స్ చాలా మంది తమ పిల్లలకు అమెరికా తో పాటు ఇతర కొన్ని దేశాల్లో జన్మనివ్వాలి అనుకుంటారు.

By:  Tupaki Desk   |   16 March 2024 3:56 AM GMT
పుట్టింటికి కల్కి హీరోయిన్‌..!
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునే ఇటీవలే తన ప్రెగ్నెన్సీ ని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న దీపికా పదుకునే తల్లి కాబోతున్న నేపథ్యంలో ఆమె సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చింది. బాలీవుడ్ లో టాప్‌ హీరోయిన్‌ గా ఉన్న దీపికా పదుకునే కనీసం ఏడాది బ్రేక్‌ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీపికా బాలీవుడ్ లో సెటిల్ అయినప్పటికి ఆమె పుట్టినిల్లు బెంగళూరు అనే విషయం తెల్సిందే. అందుకే ఆమె తన ప్రెగ్నెన్సీ సమయంను మరియు డెలివరీని బెంగళూరు లో ప్లాన్‌ చేసుకుంటున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

సాధారణంగా స్టార్స్ చాలా మంది తమ పిల్లలకు అమెరికా తో పాటు ఇతర కొన్ని దేశాల్లో జన్మనివ్వాలి అనుకుంటారు. అక్కడ జన్మించడం వల్ల అక్కడి పౌరసత్వం వస్తుందని భావిస్తారు. కానీ దీపికా పదుకునే మాత్రం తన బేబీకి పుట్టినిల్లు అయిన బెంగళూరులో జన్మనివ్వాలని భావిస్తుందట.

ఇప్పటికే బెంగళూరులోని తన పుట్టినింట ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా కన్నడ మీడియా లో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కమిట్‌ అయిన ప్రాజెక్ట్‌ లను పూర్తి చేసే పనిలో దీపికా పదుకునే ఉంది. ఇప్పటికే ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్‌ ను ముగించిన దీపికా పదుకునే మరో వైపు బాలీవుడ్‌ సింగం 2 ను కూడా ముగించింది.

మే నెలలో ప్రభాస్ కల్కి సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. పరిస్థితులను బట్టి అర్థం అవుతున్న విషయం ఏంటంటే ఆమె కల్కి ప్రమోషన్స్ కి హాజరు అయ్యే పరిస్థితి లేదు. ఆమె తో ఒకటి లేదా రెండు ఇంటర్వ్యూలు అయినా చేయించేందుకు మేకర్స్ ఇప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారట.