Begin typing your search above and press return to search.

2024 లో దీపిక శుభ‌వార్త చెబుతుందా!

ఇప్ప‌టికే ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ లు అమ్మ‌నాన్న‌లుగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. పెళ్లైన ఏడాదే ఆ దంప‌తులు త‌ల్లిదండ్రులయ్యారు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 3:00 AM GMT
2024 లో దీపిక శుభ‌వార్త చెబుతుందా!
X

2024 లో ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకొణే శుభ‌వార్త చెబుతారా? త‌మ మ‌ధ్య‌లోకి కొత్త మెంబ‌ర్ల‌ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. పెళ్లైన ద‌గ్గ‌ర నుంచి దీపిక‌-ర‌ణ‌వీర్ ఇద్ద‌రు సినిమాల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. జీవితంలో కొత్త ఆశ‌లు నింపుకోవాలి అన్న ఆలోచ‌న లేకుండా ఇంత‌కాలం పని చేస్తూ వ‌చ్చారు. కానీ తాజాగా దీపిక మాట‌ల్ని బ‌ట్టి 2024 లో పిల్ల‌ల్ని ప్లాన్ చేస్తున్న‌ట్లే క‌నిపిస్తుంది.

'పిల్ల‌లంటే ర‌ణ‌వీర్ తో పాటు నాకు ఎంతో ఇష్టం. సొంత కుటుంబాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆస‌క్తిగా ఉన్నాం' అన్నారు. దీంతో దీపిక‌-ర‌ణ‌వీర్ ఇద్ద‌రు ఇదే ఏడాది శుభ‌వార్త ఖాయ‌మంటూ నెట్టింట ప్ర‌చారం షురూ అయింది. ఇప్ప‌టికే ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ లు అమ్మ‌నాన్న‌లుగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. పెళ్లైన ఏడాదే ఆ దంప‌తులు త‌ల్లిదండ్రులయ్యారు.

అప్ప‌టి నుంచి ర‌ణ‌వీర్-దీపిక ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారంటూ? సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. కానీ వాటిపై ఏనాడు ఆ దంప‌తులు స్పందించ‌లేదు. తాజాగా దీపిక ఆస‌క్తిని బ‌ట్టి కొత్త ఏడాదిలో షురూ చేసేలా క‌నిపిస్తున్నారు. అలాగే దీపిక త‌న వ్య‌క్తిత్వానికి సంబంధించి కూడా కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. 'నేను సినిమాల్లోకి రాక‌ముందు ఎలా ఉన్నానో? ఇప్పుడు అలాగే ఉన్నాను.

నాలో ఎలాంటి మార్పు రాలేదు. న‌న్ను నేరు రోజు ఎలా ఉన్నాను అని ప్ర‌శ్నించుకుంటాను. నాలో మార్పు వ‌స్తే ముందుగా తెలిసేది నాకే. ఇదే విష‌యాన్ని నాకు పుట్ట‌బోయే బిడ్డ‌ల‌కు కూడా చెబ‌తాను. వారిని అలాగే పెంచుతా' అని అంది. దీపిక‌-ర‌ణ‌వీర్ సింగ్ పెళ్లి చేసుకుని ఐదేళ్లు అవుతోన్న సంగ‌తి తెలిసిందే.