Begin typing your search above and press return to search.

ధోని-యూవీతో దీపిక డేటింగ్ గుట్టు ర‌ట్టు

అందులో ఎం.ఎస్ ధోని- యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు. క్రికెట్ స్టార్ల‌తో దీపిక‌ సంబంధాల గురించి అప్ప‌ట్లో చాలా పుకార్లు షికార్ చేసాయి.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:36 AM GMT
ధోని-యూవీతో దీపిక డేటింగ్ గుట్టు ర‌ట్టు
X

'కాఫీ విత్ క‌ర‌ణ్' కొత్త సీజ‌న్ ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వేదిక‌పై ఎప్ప‌టిలానే బెడ్ రూమ్ ర‌హ‌స్యాల‌ను, రొమాంటిక్ డేట్ గుట్టు మ‌ట్ల‌ను క‌ర‌ణ్ య‌థావిధిగా బ‌హిర్గ‌తం చేయిస్తున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే ఇంత‌కుముందు ఎన్న‌డూ బ‌య‌ట‌పెట్టని తన శృంగార సంబంధాల గురించి ఓపెనైంది. బాలీవుడ్‌లో దీపికా కెరీర్ పీక్స్ లో ఉన్న క్ర‌మంలోనే ప‌లువురు క్రికెటర్లు త‌న‌ను ప్రేమించారు. అందులో ఎం.ఎస్ ధోని- యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు. క్రికెట్ స్టార్ల‌తో దీపిక‌ సంబంధాల గురించి అప్ప‌ట్లో చాలా పుకార్లు షికార్ చేసాయి.

కొన్నేళ్ల క్రితం MS ధోనీతో దీపిక డేటింగ్ చేస్తున్నట్లు మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఈ ఊహాగానాలు ఎంత‌వ‌ర‌కూ వెళ్లాయంటే.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బంధం చాలా బలంగా ఉందని, నిశ్చితార్థం గురించి ఆలోచించారని కూడా ప్ర‌చార‌మైంది. పుకార్లకు ఆజ్యం పోస్తూ దీపిక త‌న మ‌న‌సులో ఉంద‌ని ఎం.ఎస్‌.ధోని బహిరంగంగా ఒప్పుకున్నాడు. దీపికతో సమావేశాన్ని సులభతరం చేయడానికి ఫరా ఖాన్ - షారూఖ్ ఖాన్ నుండి సహాయం కోరాడు. అయితే ఈ పుకార్ల న‌డుమ యువరాజ్ సింగ్ స‌డెన్ ఎంట్రీ ఊహించ‌ని మ‌లుపు. యువరాజ్‌తో తన స్నేహాన్ని కొనసాగించేందుకు ధోనీ త‌న‌కు తానుగానే దీపికకు దూరమయ్యాడని ప్ర‌చార‌మైంది. మీడియా నిరంతర ఊహాగానాల న‌డుమ‌ దీపికా పదుకొణెతో ఎటువంటి శృంగార సంబంధం లేదని ఆ త‌ర్వాత ధోని అన్నారు.

ధోనీతో ఎఫైర్ క‌హానీ సంగ‌తి అలా ఉంటే, ఆ త‌ర్వాత‌ యువరాజ్ సింగ్‌తో దీపిక డేటింగ్ చేస్తోంద‌ని పుకార్లు వచ్చాయి. అయితే ఈ సంబంధం కూడా స్వల్పకాలికం. యువరాజ్ నుంచి దీపిక‌ బహిరంగంగా విడిపోయింది. తన పనిలో అతని జోక్యం వారి మ‌ధ్య రిలేష‌న్ లో గందరగోళానికి దారి తీసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ త‌ర్వాత‌ యువరాజ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో విడిపోవడంపై తన దృక్పథాన్ని రివీల్ చేసాడు. ముంబైలోని పరస్పర స్నేహితుల ద్వారా తాము కలుసుకున్నామ‌ని, ఒకరినొకరు మొదట ఇష్టపడ్డామ‌ని యూవీ తెలిపాడు. అయినప్పటికీ వారి సంబంధం ఎక్కువ‌కాలం కొనసాగలేదు. చివ‌రికి ఇద్ద‌రూ విడిపోవాల‌ని కోరుకున్నారు. అలా చేయ‌డం దీపికా వ్యక్తిగత ఎంపిక అని, త‌న‌పై ఎలాంటి దురభిప్రాయం లేదని యువరాజ్ తెలిపాడు

దీపికా పదుకొణె -యువరాజ్ సింగ్ ఇద్దరూ ఎవ‌రికి వారు తమ జీవితాల్లో సెటిల‌య్యారు. ఆనంద జీవ‌నం సాగిస్తున్నారు. దీపికా నటుడు రణవీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. యువరాజ్ బాలీవుడ్ నటి హజెల్ కీచ్‌ను ప్రేమించి పెళ్లాడాడు. MS ధోని విషయానికొస్తే... అతడు సాక్షిని వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నాడు. ధోని ప్ర‌స్తుతం క్రికెట్ అనంతర ప్రయత్నాలపై దృష్టి పెడుతున్నాడు. ధోనీ - యువరాజ్ సింగ్‌లతో దీపికా పదుకొనే సంబంధాలపై పుకార్లు కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఊహాగానాల న‌డుమ అన్నిటికీ ముగింపు ప‌లికి ఎవ‌రికి వారు జీవితాల్లో సెటిల‌య్యారు. క్రీడాభిమానులు, వినోద ప్రియులు వారి ఎంపికలను గౌరవించాలి. వీటిలో కొన్ని నిజాలు ఉన్నా చాలా ఊహాగానాలు మాత్ర‌మేన‌ని భావించాలి.