Begin typing your search above and press return to search.

హ‌బ్బీని అనుకోకుండా మాజీ ప్రియుడి పేరుతో పిలిచింది

పొడుగుకాళ్ల సుంద‌రి దీపికా పదుకొణె `క‌ల్కి 2898 AD` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 May 2024 3:51 AM GMT
హ‌బ్బీని అనుకోకుండా మాజీ ప్రియుడి పేరుతో పిలిచింది
X

పొడుగుకాళ్ల సుంద‌రి దీపికా పదుకొణె `క‌ల్కి 2898 AD` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న ఈ బ్యూటీ న‌టిస్తుండడంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌భాస్ అభిమానుల‌ను టీజ్ చేస్తూ దీపిక చేసిన కామెంట్ల గురించి తెలిసిందే. ఇప్పుడు క‌ల్కి చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. కార‌ణం ఏదైనా కానీ దీపిక గురించిన టాపిక్ ఇప్పుడు తెలుగు లోగిళ్ల‌లోను స్పెష‌ల్ గా మారుతోంది.

తాజాగా దీపిక పాత ఇంటర్వ్యూ నుండి ఒక క్లిప్ రెడ్డిట్‌లో వైర‌ల్‌గా మారింది. ఈ క్లిప్ చాలా వేగంగా ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. ఈ వీడియోలో తన భర్త రణవీర్ సింగ్‌ను అభినందిస్తూ దీపిక అనుకోకుండా అతడిని రణబీర్ అని పిలిచింది. ర‌ణ‌బీర్ క‌పూర్ అలియాస్ ఆర్కే దీపిక మాజీ ప్రియుడు అన్న సంగ‌తి తెలిసిందే. తన ప్రస్తుత భర్త రణవీర్ సింగ్‌తో డేటింగ్ చేయడానికి ముందు కొన్ని సంవత్సరాల పాటు దీపిక‌.. రణబీర్ కపూర్‌తో డేటింగ్ చేసింది. ఆ ఇద్ద‌రి జంట షికార్ల గురించి అభిమానుల‌కు స్ప‌ష్ఠంగా తెలుసు. అయితే ర‌ణ‌బీర్- ర‌ణ‌వీర్ పేర్ల మ‌ధ్య ఉన్న సారూప్య‌త డీపీని చాలా క‌న్ఫ్యూజ్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. అభిమానులు తరచుగా గందరగోళానికి గుర‌వుతుంటారు కూడా. దీపిక కూడా ఈ పొరపాటుకు కొత్తేమీ కాదు. భ‌ర్త‌ను ఇలా మాజీ ప్రియుడి పేరుతో పిలిచినా కానీ అది పెద్ద స‌మ‌స్య కూడా కాదు. పెళ్లికి ముందే దీపిక ప్రేమాయ‌ణం గురించి ర‌ణ‌వీర్ సింగ్ కి పూర్తిగా తెలుసు. వారి మ‌ధ్య అండ‌ర్ స్టాండింగ్ ఎప్ప‌టికీ స‌మ‌స్య కాదు.

మ‌రోవైపు దీపికా పదుకొణె రణవీర్ సింగ్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. దీపికా ఇటీవల తన ఓటు వేయడానికి బయటకు వచ్చినప్పుడు ట్రోలింగుకి గురైంది. నెటిజన్లలో ఒక వర్గం ఆమె బేబీ బంప్‌ను ఫేక్ అని కామెంట్ చేసారు. ఆ త‌ర్వాత షైనింగ్ ఎల్లో మ్యాక్సీ డ్రెస్‌లో తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ సంతోషకరమైన ఫోటోలను దీపిక షేర్ చేసి ఛ‌మ‌త్కార‌మైన సమాధానం ఇచ్చింది.

దీపిక చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాసిన పోస్ట్ వైర‌ల్ అయింది. దాని సారాంశం ఇలా ఉంది.``ప్రియమైన సోషల్ మీడియా, దీపికా పదుకొనే తన ప్రజాస్వామ్య కర్తవ్యంలో భాగంగా ఓటు వేయడానికి బయలుదేరింది. ఆమె శరీరం లేదా ఆమె గర్భం గురించి మీ అభిప్రాయాన్ని అడగలేదు. ఆమె జీవితంలోని ఏ అంశంపైనైనా వ్యాఖ్యానించే హక్కు మీకు లేదు. ఆపండి.. స‌రిగా ప్ర‌వ‌ర్తించండి`` అని రాసారు. రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ ఈ పోస్ట్‌ను లైక్ చేసారు. ఆలియా సోదరీమణులు పూజా భట్ , షాహీన్ భట్ త‌న‌ తల్లి సోనీ రజ్దాన్ కూడా పోస్ట్‌ను లైక్ చేసారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే దీపిక ప్రస్తుతం రోహిత్ శెట్టి సింగం ఎగైన్ షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో క్రూరమైన పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా కల్కి 2898 ADలో కూడా కనిపిస్తుంది. ఇందులో ప్ర‌భాస్, అమితాబ్ బచ్చన్‌, క‌మల్ హాస‌న్‌లతో స్క్రీన్‌ను షేర్ చేసుకుంటోంది.