టాలీవుడ్ లో దీపిక-ప్రియాంక మధ్య పోటీ!
ఈ సినిమా హిట్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. బాలీవుడ్ సినిమా కంటే ఓ తెలుగు సినిమాతోనే దేశి విదేశాల్లో ఎక్కువ గుర్తింపు దక్కింది.
By: Tupaki Desk | 14 July 2025 8:00 PM ISTహీరోయిన్ల మధ్య పోటీ అన్నది సహజం. ఒకరి అవకాశాలు మరొకరు తన్నుకుపోతుంటారు. కొన్ని అవకాశాల కోసం టార్గెట్ గా బిహైండ్ రాజకీయం చేస్తుంటారు. ఈ రకమైన పోటీ స్టార్ హీరోయిన్ల మధ్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. భవిష్యత్ లో ఇలాంటి పోటీ దీపికా పదుకొణే-ప్రియాంక చోప్రా మధ్య కూడా తప్పేలా లేదు. అందులోనూ ఇద్దరు టాలీవుడ్ లో ఈ పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. 'కల్కి' తో దీపికా పదుకొణే టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా హిట్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. బాలీవుడ్ సినిమా కంటే ఓ తెలుగు సినిమాతోనే దేశి విదేశాల్లో ఎక్కువ గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం కోసం హీరోయిన్ గా ఎంపిక చేసారు. అమ్మడు ఇందులో బన్నీ సరసన నటిస్తుంది. ఈ సినిమా తర్వాత దీపిక పాన్ ఇండియా రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. అటు గ్లోబల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటోన్న ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమాలను సైతం కాదని టాలీవుడ్ లో ఎస్ఎస్ ఎంబీ 29 తో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఎంతో మంది భామల పేర్లను పరిశీలించిన అనంతరం ప్రియాంక లాక్ అయింది. ఈ ప్రాజెక్ట్ ను ఆమె అంగీకరించడం కూడా గొప్ప విషయమే. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఎంతో బిజీ నటి. వందల కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటుంది. పీసీతో సినిమా చేయాలని బాలీవుడ్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వాళ్లను సైతం కాదని పీసీ రాజమౌళి సినిమాకు ఒకే చెప్పడం మరో పెద్ద విషయం. ఇండియాస్ మోస్ట్ అవైడెట్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రం రూపొందుతుంది.
అటు బన్నీ చిత్రం పై కూడా క్రేజ్ అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించిన తర్వాత ఇండియాలో హీరోయిన్ల ఇద్దరి క్రేజ్ రెట్టింపు అవుతుంది. అటుపై వాళ్లు కమిట్ అయ్యే కొత్త ప్రాజెక్ట్ లు అంతే ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇద్దరి మధ్య తగ్గాఫ్ వార్ నడిచే అవకాశం ఉంటుంది. అవకాశాల పరంగా భామలిద్దరు పోటీ పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒకసారి పోటీ మొదలైందంటే? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. నువ్వా? నేనా? అన్న రేంజ్ వార్ తప్పదు.
