దీపికలో వంగాకు నచ్చనిది అది కాదు ఇదీ
క్రమశిక్షణ లేని సమాజంగా ఇప్పటికే బాలీవుడ్ పై ముద్ర పడి ఉన్నప్పుడు దీపిక అయినా జాగ్రత్తపడాలి కదా? కానీ అలా జరగలేదు.
By: Tupaki Desk | 31 May 2025 1:00 AM ISTదీపిక పదుకొనేతో 'స్పిరిట్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అసలు సమస్య ఏమిటి? అంటే ఈ గొడవను మరింత లోతుగా విశ్లేషిస్తే చాలా కోణాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం 8 గంటల పని దినం గురించి.. 6 గంటలకు కుదింపు గురించిన గొడవ కానే కాదు. 20 కోట్ల పారితోషికం డిమాండ్ గురించి అసలే కాదు..! దీపిక ప్రవర్తన కారణంగా తలెత్తిన గొడవ ఇది.
లోతుగా విశ్లేషిస్తే సందీప్ వంగా చేసిన కామెంట్లు వేరుగా ఉన్నాయి. ఏరు దాటాక తెప్ప తగలేసే దీపిక పదుకొనే నైజాన్ని అతడు ప్రశ్నించాడు. దీపిక క్రమశిక్షణా రాహిత్యాన్ని, బాలీవుడ్ లో పీఆర్ గేమ్స్ ను ప్రశ్నించాడు. అక్కడ తారలు లేదా ఇతరుల గేమ్స్ ఇలానే ఉంటాయా? దీపికను ఎంపిక చేయలేదు అనగానే, స్పిరిట్ కథ పాయింట్ గురించి ఓపెన్ గా లీక్ చేయాలా? అప్పటికే ఇలాంటివి కుదరవు అనే అగ్రిమెంట్ కూడా ఉంది కదా? అని సందీప్ వంగా గుర్తు చేసాడు.
క్రమశిక్షణ లేని సమాజంగా ఇప్పటికే బాలీవుడ్ పై ముద్ర పడి ఉన్నప్పుడు దీపిక అయినా జాగ్రత్తపడాలి కదా? కానీ అలా జరగలేదు. 1000 కోట్ల క్లబ్ సినిమాని తీయగల సమర్థుడైన దర్శకుడితో మాట్లాడేప్పుడు స్త్రీ వాదం ప్రదర్శిస్తానంటే కుదురుతుందా? ఫెమినిజం ఎప్పుడూ సందీప్ వంగాకు సమస్యే. అతడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. తన ఐడియాలజీని బలంగా సమర్థించుకునే తత్వం అతడికి మొదటి నుంచీ ఉంది. దానికి వ్యతిరేకంగా వెళితే రక్త కన్నీరే!
ఓడను నడిపించే నావికుడితో గొడవ పడితే ఎవరికి నష్టం? ఫెమినిజం ప్రదర్శించి తనను తాను నట్టేట ముంచుకుంది దీపిక. అయినా ఎవరికి వారు నచ్చినట్టు ఉంటానంటే ఎలా కుదురుతుంది? ఇటువైపు వంగా ఈగో దెబ్బ తింటే ఘర్షణ పుట్టుకు రాదా? ఇదిగో ఇందులోంచి పుట్టుకొచ్చిన ఘర్షణను మాత్రమే మనం డీప్‌గా చూడాలి.
ఇటీవల 'మా' ట్రైలర్ లాంచ్ వేడుకలో కాజోల్- దేవగన్ ఇద్దరూ దీపిక నిర్ణయాన్ని సమర్థిస్తూనే, ఏ కండిషన్ లో అయినా 8 గంటల పాటు నటీనటులు పని చేస్తున్నారని అన్నారు. అయితే ఒక్కోసారి కొన్ని మారతాయి.. దర్శకుడు అంగీకరిస్తే ముందుగానే సెట్లోంచి వెళ్లొచ్చు అనే అర్థం కూడా దేవగన్ మాటల్లో ప్రతిధ్వనించింది. వ్యక్తుల మధ్య అన్నీ బావుంటే సర్ధుబాటు కుదురుతుంది. నిజమే మరి... దీపిక పదుకొనే అనవసరమైన ఫెమినిజం ప్రదర్శించకుండా డౌన్ టు ఎర్త్ ఉండి దర్శకుడిని రెక్వస్ట్ చేసుకుంటే, తనకు 6 గంటల పని దినాలు లభించేవేమో.. అలా కాకుండా నేను కోటలో మహారాణి.. నువ్వు ఒక సాధారణ సైనికుడివి.. అన్న తీరుగా దీపిక ప్రవర్తించడం వల్లనే ఈగో గొడవ పెద్దదైందని విశ్లేషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొన్ని సార్లు ఈగోలకు పోతుంటారు. అలాంటి వారందరికీ ఈ గొడవ సులువుగానే అర్థమవుతుంది.
