Begin typing your search above and press return to search.

దీపికా ప‌దుకొణేతో బాలీవుడ్ కి కొత్త టెన్ష‌న్!

బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే-సందీప్ రెడ్డి వంగా మ‌ధ్య వివాదం ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Jun 2025 2:00 AM IST
దీపికా ప‌దుకొణేతో బాలీవుడ్ కి కొత్త టెన్ష‌న్!
X

బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొణే-సందీప్ రెడ్డి వంగా మ‌ధ్య వివాదం ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. `స్పిరిట్` స్టోరీ చెబితే దీపిక ప‌దుకొణే పీఆర్ టీమ్ లీక్ చేసి పెద్ద త‌ప్పు చేసిందంటూ మొద‌లైన రచ్చ ఇరువురి మ‌ధ్య మాట‌ల యుద్దానికి దారి తీసింది. అటుపై ర‌క‌ర‌కాల అంశాలు చ‌ర్చ‌కు దారి తీసాయి. ఇరువురు ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. న‌టీన‌టుల‌కు ఎవ‌రికైనా క‌థ చెబితే వాళ్లిద్ద‌రి మ‌ధ్య అన‌ధికారిక నాన్ డిస్ క్లోజ‌ర్ అగ్రిమెంట్ ఉన్న‌ట్లే అంటూ సందీప్ గుర్తు చేసాడు.

అగ్రిమెంట్ ను బ్రేక్ చేసి పీఆర్ టీమ్ తో లీకులిచ్చి దెబ్బ తీసే ప్ర‌య‌త్నం చేసింద‌న్న‌ది సందీప్ ఆరోప ణ‌గా తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఇప్పుడిదే అంశం దీపిక పై మరింత ప్ర‌తికూల ప‌రిస్థితుల‌కు దారి తీస్తుం ది. దీపిక తీరుతో బాలీవుడ్ కి కొత్త టెన్ష‌న్ షురూ అయింది. భవిష్య‌త్ లో త‌మ సినిమా క‌థ‌ల‌కి కూడా ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతందా? అని బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల్లో కంగారు మొద‌లైంది.

డైరెక్ట‌ర్ నేరెట్ చేసిన స్టోరీ న‌చ్చ‌క‌పోయినా? త‌న డిమాండ్ల కు ఒప్పుకోక‌పోయినా దీపిక పీఆర్ టీమ్ ఇలాగే స్టోరీ లీక్ చేసి రోడ్డున పెట్టేస్తుందా? అని ఆందోళ చెందుతున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొ స్తున్నాయి. దీపిక‌ను చూసి ఇత‌ర హీరోయిన్లు కూడా ఇదే తీరున వ్య‌వ‌హ‌రిస్తే సినిమా ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్రాజెక్ట్ మ‌ధ్య‌లో ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో హీరోయిన్ కి ఏవైనా స‌మ‌స్య‌లు , గొడ‌వ‌లు త‌లెత్తి వెళ్లిపోతే? ఆ సినిమా స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌ద‌ని గ్యారెంటీ ఏంటి అనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. చిన్న చిన్న ఆర్టిస్టులైతే ఇలాంటి వివాదాల‌కు తెర తీయ‌రు. ఒక‌వేళ చేసినా పెద్ద‌గా ఫోక‌స్ అవ్వ‌దు. అదే ప‌ని ఓ అగ్ర హీరోయిన్ చేసిందంటే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ జ‌రుగుతుందని ప‌లువురు నిర్మాత‌లు అంచ‌నా వేస్తున్నారు.