Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమా కోసం 20 కోట్ల డిమాండ్!

బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ మూవీని రూపొందించనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2025 4:51 PM IST
ప్రభాస్ సినిమా కోసం 20 కోట్ల డిమాండ్!
X

బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. స్పిరిట్ మూవీని రూపొందించనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించనున్న ఆ సినిమాను బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ గ్రాండ్ గా నిర్మించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఓ సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో స్పిరిట్ మూవీని తీస్తున్నట్లు ఇప్పటికే సందీప్ వంగా తెలిపారు. సినిమాలో వైలెన్స్, యాక్షన్ ఫుల్ గా ఉంటుందని చెప్పారు. దీంతో ఇప్పటికే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో భారీ హిట్ అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు.

అయితే ఇంకా మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు కానీ ఎప్పటికప్పుడు మూవీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హీరోయిన్ కోసం కొంతకాలంగా డిస్కషన్స్ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, ఆలియా భట్ సహా అనేక మంది పేర్లు వినిపించాయి. కానీ మేకర్స్ మాత్రం ఇంకా ఎవరి పేరు అనౌన్స్ చేయలేదు.

ఇప్పుడు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు గట్టిగా వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ కనుక.. నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న హీరోయిన్‌ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆమెను మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. అప్పుడు ఆమె రూ.20 కోట్ల పారితోషికం అడిగినట్లు టాక్ వినిపిస్తోంది.

అందుకు మేకర్స్ కూడా ఓకే చెప్పేశారని.. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. వార్తలు నిజమో కాదో తెలియకపోయినా టాక్ అయితే వినిపిస్తోంది. మేకర్స్ రెస్పాండ్ అయితే గానీ అసలు విషయం తెలియదు. ఒకవేళ ఆ వార్త నిజమైతే.. ఇండియాలోనే హైయెస్ట్ పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ గా దీపిక రికార్డు సృష్టించడం గ్యారెంటీ.

అదే సమయంలో ఇప్పటికే ప్రభాస్, దీపిక.. కల్కి 2898 ఏడీ మూవీకి గాను షేర్ చేసుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఆ మూవీ సీక్వెల్ లో కూడా యాక్ట్ చేయనున్నారు. ఇప్పుడు స్పిరిట్ లో ఆమె కన్ఫర్మ్ గా నటిస్తే.. ఇద్దరికీ హ్యాట్రిక్ కాంబో అవుతుంది. మరి చూడాలి దీపికనే స్పిరిట్ లో హీరోయినో కాదో..