Begin typing your search above and press return to search.

ర‌ణ్‌వీర్ - ర‌ణబీర్ త‌ల్లిదండ్రుల్లాంటోళ్లు: దీపిక‌

ఒక పాత ఇంట‌ర్వ్యూలో దీపిక‌కు ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. ర‌ణ‌బీర్, ర‌ణ‌వీర్ ఇద్ద‌రితో క‌లిసి న‌టించారు. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు మంచి న‌టుడు? అని ఒక అభిమాని ప్ర‌శ్నించారు.

By:  Tupaki Desk   |   18 April 2025 9:59 AM IST
ర‌ణ్‌వీర్ - ర‌ణబీర్ త‌ల్లిదండ్రుల్లాంటోళ్లు: దీపిక‌
X

`క‌ల్కి 2898 ఏడి` చిత్రంతో దీపిక ప‌దుకొనే టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఒక త‌మిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన దీపిక ఆ త‌ర్వాత బాలీవుడ్ లో పాపుల‌ర్ హీరోయిన్ గా ఎదిగింది. మ‌హేష్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న దీపిక న‌టించాల్సి ఉన్నా, టాలీవుడ్ ఆరంగేట్రం చాలా ఆల‌స్య‌మైంది. చివ‌రికి ప్ర‌భాస్ `క‌ల్కి 2898 ఏడి` చిత్రంతో దీపిక స‌రైన స‌మ‌యంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇక దీపిక ప‌దుకొనే పోష్ లైఫ్ స్టైల్, ప్రేమాయ‌ణాల గురించి తెలిసిందే. గ‌తంలో ర‌ణబీర్ క‌పూర్ తో కొన్నేళ్ల పాటు ప్రేమాయ‌ణం సాగించిన దీపిక‌, ఆ త‌ర్వాత అత‌డి నుంచి బ్రేక‌ప్ అయింది. అటుపై ర‌ణ్ వీర్ సింగ్ తో స్నేహం, ప్రేమ‌, పెళ్లి వ్య‌వ‌హారాల గురించి తెలిసిందే. ర‌ణ్ వీర్ - దీపిక జంట ఇటీవ‌లే త‌ల్లిదండ్రుల‌య్యారు.

ఒక పాత ఇంట‌ర్వ్యూలో దీపిక‌కు ఒక ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది. ర‌ణ‌బీర్, ర‌ణ‌వీర్ ఇద్ద‌రితో క‌లిసి న‌టించారు. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు మంచి న‌టుడు? అని ఒక అభిమాని ప్ర‌శ్నించారు. అయితే దీపిక ఆ ప్రశ్నను తెలివిగా తప్పించుకున్నారు. వారిని లేదా వారి పనిని పోల్చాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ ఎంచుకోమంటే, అది మీ తల్లి లేదా తండ్రి ఇద్ద‌రిలో ఎవ‌రు బెస్ట్ అనేది అడ‌గ‌డం లాంటిది అని అన్నారు. రణబీర్ సరదాగా ఒక‌ తండ్రిలాగా ఉండాలనుకుంటున్నాను! అని అంది. ఇద్దరు నటులకు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఎవ‌రికి వారు ప్ర‌శంసించ‌ద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ప్ర‌తిదానిలో పోల్చి చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని దీపిక వ్య‌ఖ్యానించారు.

దీపిక- రణబీర్ గత ప్రేమకథ అంద‌రకీ తెలిసిన‌దే. `బచ్నా ఏ హసీనో` షూటింగ్ సమయంలో రణబీర్ - దీపిక ప్రేమలో పడ్డారు. దీపిక త‌న‌ మెడపై ఆర్.కే అనే రెండ‌క్ష‌రాల పేరును కూడా టాటూ వేయించుకున్నారు. అయితే, ఆ తర్వాత ఈ జంట‌ విడిపోయారు. విడిపోయినా స్నేహితులుగా కొన‌సాగుతున్నారు. యే జవానీ హై దీవానీ, తమాషా వంటి హిట్ చిత్రాలలో కలిసి పనిచేశారు.

రణ్‌వీర్ -దీపిక జంట‌ బాజీరావ్ మస్తానీ, గోలియోన్ కి రాస్ లీలా రామ్ లీలా, 83, సింగం ఎగైన్ చిత్రాలలో కలిసి నటించారు. 2018లో ఈ జంట‌కు పెళ్లయింది. వారి అన్యోన్య దాంప‌త్యం అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశం.