దీపిక మోడలింగ్ రోజుల్లో ప్రేమికుడు ఇతడే
బాలీవుడ్ అందాల కథానాయిక దీపిక పదుకొనే, ఇటీవల సందీప్ వంగా `స్పిరిట్` ఆఫర్ ని కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దీపిక డౌన్ ఫాల్ గురించి ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 6 Jun 2025 11:28 AM ISTబాలీవుడ్ అందాల కథానాయిక దీపిక పదుకొనే, ఇటీవల సందీప్ వంగా `స్పిరిట్` ఆఫర్ ని కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దీపిక డౌన్ ఫాల్ గురించి ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. దీపిక ఫెమినిజం సమస్యల్ని తెచ్చిపెడుతోందని గుసగుసలు వినిపించాయి. ఇదే సమయంలో దీపిక గత ఎఫైర్ల గురించి మరోసారి కొన్ని వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
దీపిక పదుకొనే ఇంతకుముందు రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జంట బ్రేకప్ స్టోరి చాలా చర్చనీయాంశమైంది. అంతకుముందు క్రికెటర్ యువరాజ్ సింగ్ తోను దీపిక డేటింగ్ వార్తలు వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ని పెళ్లాడి, ఒక బిడ్డకు మామ్ అయిన విషయం విధితమే.
ఇప్పటికీ దీపిక గత డేటింగుల గురించి ప్రస్థావన ఆశ్చర్యపరుస్తోంది. దీపిక పదుకొనే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన సమయంలో చాలా సాధా సీదా జీవితాన్ని గడిపింది. ముంబైలో ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో రిక్షా లేదా రిక్షాలో వెళ్లాల్సి వచ్చేది. ఆ సమయంలో దీపికతో డేటింగ్ చేసిన ముజమ్మిల్ ఇబ్రహీం అనే మోడల్ ఇప్పుడు ఆ విషయాన్ని బహిరంగంగా ప్రస్థావించారు. అతడు ఒక పాపులర్ మోడల్. కానీ అప్పటికి దీపిక అప్‌కమ్ మోడల్ మాత్రమే. అంతగా ఫేమ్ గుర్తింపు లేవు. 2000ల ప్రారంభంలో దీపికతో తాను డేటింగ్ చేసానని అతడు వెల్లడించాడు. దీపికను మొదటగా ముంబైలో కలిసిన వ్యక్తిని నేను. మేం రెండేళ్ల పాటు డేటింగ్ చేసాం. ఇదే నా మొదటి రిలేషన్‌షిప్.. అని వెల్లడించాడు. అయితే దీపిక నుంచి తాను విడిపోయానని, అప్పటికి దీపిక పెద్ద ఫేమస్ మోడల్ కాదని కూడా అతడు వెల్లడించాడు. సంబంధంలో దీపిక చాలా నిజాయితీపరురాలు అని కూడా కితాబిచ్చాడు. ఆరోజుల్లో విడిపోయాను.. ఇప్పుడు దీపిక పెద్ద సూపర్ స్టార్. అయినా దీనికి రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదని కూడా ముజమ్మిల్ ఇబ్రహీం అన్నాడు.
దీపిక తండ్రి ప్రముఖుడు కాబట్టి తనకు పరిచయాలు చేసుకోవడం సులువు. కానీ అప్పట్లో డబ్బు పెద్దగా లేదు. మేం కలిసి రిక్షాలో డేటింగ్ కి వెళ్లేవాళ్లం. ముంబైలో సాధారణ డేట్ లైఫ్ ని ఆస్వాధించామని కూడా అతడు చెప్పాడు. అయితే పబ్లిక్ కి అంతగా తెలియని ముజమ్మిల్ ఇబ్రహీం ఇప్పుడు పబ్లిసిటీ కోరుకోవడం వల్లనే ఇలా చెప్పుకుంటున్నాడని విమర్శలొస్తున్నాయి. ఒక పెళ్లయిన యువతి గురించి ఇలా మాట్లాడటం సరికాదని ట్రోల్ చేస్తున్నారు.
