దీపికా రిజెక్ట్ చేసిన సినిమాలివే
అయితే దీపిక చేయలేక నో చెప్పిన సినిమాల లిస్ట్ కాస్త పెద్దగానే ఉంది. మరి లిస్ట్ ఏంటి? వాటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలేంటన్నది చూద్దాం.
By: Tupaki Desk | 28 May 2025 6:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమా స్పిరిట్. అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలు సాధించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుందని కొందరంటుంటే, మరికొందరు కావాలనే దీపికాను స్పిరిట్ నుంచి తప్పించారని అన్నారు. కారణాలేవైనా సరే దీపికా మాత్రం స్పిరిట్ లో నటించడం లేదు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ పక్కన దీపికా నటిస్తే బావుంటుందని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశపడ్డారు కానీ ఆ ఛాన్స్ ను దీపికా మిస్ చేసుకుంది.
అయితే దీపికా ఇన్నేళ్ల తన కెరీర్లో వివిధ కారణాలతో కొన్ని సినిమాలను మిస్ చేసుకుంది. అలా అమ్మడు మిస్ చేసుకున్న సినిమాల్లో కొన్ని సినిమాలు సూపర్ హిట్లు కాగా మరికొన్ని యావరేజ్ గా నిలిచాయి. అయితే దీపిక చేయలేక నో చెప్పిన సినిమాల లిస్ట్ కాస్త పెద్దగానే ఉంది. మరి లిస్ట్ ఏంటి? వాటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలేంటన్నది చూద్దాం.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 2022లో తెరకెక్కిన గుంగూబాయి కథియావాడి సినిమా ఆఫర్ ముందుగా దీపికాకే వచ్చిందట. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల దీపికా ఆ సినిమాను చేయలేకపోయింది. దీంతో ఆ ఛాన్స్ అలియా భట్ కు వెళ్లింది. ఆ సినిమాలో తన నటనకు అలియా ఏకంగా నేషనల్ అవార్డును కూడా అందుకుందనే విషయం తెలిసిందే. ఇక రణ్‌బీర్ కపూర్ హీరోగా 2011లో వచ్చిన రాక్‌స్టార్ సినిమాను కూడా దీపికా చేయాల్సింది. దీపికా ముందుగా ఈ సినిమాను చేద్దామనుకున్నప్పటికీ ఆ తర్వాత కాల్షీట్స్ కుదరకపోవడంతో ఒప్పుకోలేకపోయింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
2016లో వచ్చిన సుల్తాన్ సినిమా ఆఫర్ కూడా ముందు దీపికాకే వెళ్లింది కానీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల సుల్తాన్ ను చేయలేకపోయింది దీపికా. 2015లో వచ్చి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్7లో కూడా దీపికా యాక్ట్ చేయాల్సింది. కానీ అదే టైమ్ లో దీపికా రామ్ లీలా సినిమా చేస్తున్నందునఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2013లో ధూమ్3 సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ ఆ టైమ్ లో తన డేట్స్ ఖాళీగా లేకపోవడంతో దాన్ని మిస్ చేసుకుంది. ఇక జబ్ తక్ హై జాన్ సినిమాలో కోసం కూడా ముందుగా దీపికానే అప్రోచ్ అయ్యారట. ఆమె రిజెక్ట్ చెయ్యడంతోనే ఆ ఛాన్స్ కత్రినా కైఫ్ కు వెళ్లింది.
