దీపికా మొదటి తెలుగు సినిమా కల్కి కాదట
ఇప్పుడు ఎక్కడ విన్నా దీపికా పదుకొణె పేరే. గత కొంతకాలంగా ఆమె పేరు తెగ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 29 Jun 2025 8:00 PM ISTఇప్పుడు ఎక్కడ విన్నా దీపికా పదుకొణె పేరే. గత కొంతకాలంగా ఆమె పేరు తెగ వినిపిస్తోంది. వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ విషయంలో ఓ భారీ ప్రాజెక్టును వదులుకున్న దీపికా పదుకొణె ఇండస్ట్రీలోకి రాకముందు మోడలింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మోడలింగ్ కంటే ముందే దీపికా బ్యాడ్మింటన్ ప్లేయర్ అని చాలా తక్కువ మందికే తెలుసు.
దీపికా తండ్రి ప్రకాష్ పదుకొణె ఇండియా తరపున బ్యాడ్మింటన్ ఆడి దేశానికి ఎంతో సేవ చేశారు. తండ్రి ఇన్‌ప్లుయెన్స్ తో మొదట బ్యాడ్మింటన్ ఆడిన దీపికా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. కానీ తర్వాత మోడలింగ్, సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తో బ్యాడ్మింటన్ ను వదిలేసి యాక్టింగ్ వైపు అడుగులేసిన దీపికా సినీ కెరీర్ ఐశ్వర్య అనే సినిమాతో మొదలైంది.
ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసిన దీపికా కల్కి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరయ్యారు. అయితే దీపికా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది. జయంత్ సి. పరాన్జీ తీసిన ఓ యూత్‌ఫుల్ లవ్ స్టోరీలో దీపికా ఓ స్పెషల్ సాంగ్ చేశారు. కానీ ఆ మూవీ ఇప్పటికీ రిలీజవక పోవడంతో ఆమె టాలీవుడ్ డెబ్యూ కల్కితో జరిగింది. కల్కితో ఎంట్రీ ఇచ్చిన దీపికా చేతిలో ఇప్పుడు కల్కి2తో పాటూ అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కబోతున్న మరో తెలుగు సినిమా కూడా ఉంది.
రామ్ లీలా షూటింగ్ టైమ్ లో రణ్‌వీర్ సింగ్ తో దీపికా పరిచయం కాస్తా ప్రేమగా మారి తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని ఇప్పుడో బిడ్డకు కూడా జన్మనిచ్చారు . రణ్‌వీర్ సింగ్ కంటే ముందు దీపికా రణ్‌బీర్ సింగ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వేరే అమ్మయితో రిలేషన్ పెట్టుకోవడం వల్లే రణ్‌బీర్ నుంచి విడిపోయానని గతంలో దీపికా ఓ సందర్భంలో చెప్పారు.
పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వచ్చిన దీపికా, తల్లి అయ్యాక సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని, తన కూతురికి టైమ్ కేటాయించేలా సినీ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే తన దగ్గరున్న సీక్రెట్స్ ను చెవిలో చెప్పాలంటే ఎవరికి చెప్తారని దీపికాను ప్రశ్నించగా, దానికి ఆమె షారుఖ్ ఖాన్ పేరు చెప్పారు. షారుఖ్, దీపికా కలిసి ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్, జవాన్ లాంటి హిట్ సినిమాలు చేశారు. వరుస సినిమాలు చేస్తూ వస్తున్న దీపికా పదుకొణె సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. ముంబైలో దీపికకు మూడు ఇళ్లు ఉండగా, 2022లో ఆమె సొంతంగా 82E అనే బ్యూటీ బ్రాండ్ ను స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్ గా రన్ చేస్తున్నారు.
