Begin typing your search above and press return to search.

సందీప్ వంగా ఫైరింగ్.. దెబ్బ‌కు సీనియ‌ర్ న‌టిలో ఒణుకు

సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` నుంచి దీపిక పొదుకొనేను తొల‌గించి, ట్రిప్తి దిమ్రీని క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 May 2025 9:22 AM IST
సందీప్ వంగా ఫైరింగ్.. దెబ్బ‌కు సీనియ‌ర్ న‌టిలో ఒణుకు
X

సందీప్ రెడ్డి వంగా `స్పిరిట్` నుంచి దీపిక పొదుకొనేను తొల‌గించి, ట్రిప్తి దిమ్రీని క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే దీపిక పెట్టిన కండీష‌న్ల‌కు సందీప్ వంగా చికాకు ప‌డ్డార‌ని ప్ర‌చార‌మైంది. 8 గంట‌లు సెట్స్ లో ఉండ‌లేన‌ని, కేవ‌లం 6 గంట‌లు మాత్ర‌మే కేటాయించ‌గ‌ల‌న‌ని దీపిక డిమాండ్ చేసింది. అలాగే 20 కోట్ల పారితోషికం లాభాల్లో వాటా కోరింద‌ని కూడా చెబుతున్నారు. అయితే 6గం.లే ప‌ని చేస్తాన‌ని అన‌డం సందీప్ వంగాకు న‌చ్చ‌లేదు.

తాజాగా ఈ వివాదం సంద‌ర్భంగా సీనియ‌ర్ న‌టి కాజోల్ కి `మా` ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్లో ఇదే ప్ర‌శ్న ఎదురైంది. కొత్త‌గా త‌ల్లి అయిన వారు ఎనిమిది గంట‌లు ప‌ని చేయ‌లేరా? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి! అని మీడియా ప్ర‌శ్నించింది. తానైతే త‌క్కువ స‌మ‌యం ప‌ని చేయ‌డానికే ఇష్ట‌ప‌డ‌తాన‌ని కాజోల్ వ్యాఖ్యానించింది. అయితే ఒక నిర్మాత హోదాలో అజ‌య్ దేవ‌గ‌న్ మాట్లాడుతూ... త‌ల్లులు ఎవ‌రైనా 8 గంట‌లు ప‌ని చేస్తున్నారు. నిర్మాత‌లు త‌ల్లుల‌ను అర్థం చేసుకుంటారు! అని వ్యాఖ్యానించారు.

ఆ సంఘ‌ట‌న (దీపిక‌తో సందీప్ ఇష్యూ) కేవ‌లం వ్య‌క్తిగ‌త‌మైన‌ది.. అది అంద‌రికీ వ‌ర్తించ‌ద‌ని దేవ‌గ‌న్ అన్నారు. నిజాయితీపరులైన ఫిలింమేక‌ర్స్ కి దీనితో ఎలాంటి సమస్య ఉండదు. ``కొత్త తల్లులు అయినా 8 గంటలు పనిచేయడం తప్ప‌దు. చాలా మంది 8 గంటలు పని చేస్తున్నారు. వ్య‌క్తిగ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను పరిశ్రమలోని చాలా మంది అర్థం చేసుకుంటారు`` అని దేవ‌గ‌న్ అన్నారు. మొత్తానికి దీపిక 6 గం.లు కండిష‌న్ పెట్టినా కానీ, సందీప్ ని క‌న్విన్స్ చేసుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లు ప‌బ్లిసిటీకే రాన‌ని ముందే ఫిలింమేక‌ర్స్ ని ఒప్పించగ‌లిగే సౌత్ క్వీన్ న‌య‌న‌తార చాణ‌క్యం గురించి ఇప్పుడు ప్ర‌శంసించి తీరాలి.