'స్పిరిట్' ని కోల్పోయాక దీపిక నష్టం ఎంతో తెలుసా?
అయితే దీపిక బ్యాడ్ టైమ్ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ భామ రెక్లెస్ యాటిట్యూడ్ కారణంగా 'స్పిరిట్' నుంచి తొలిగించారనే సమాచారం వెలువడ్డాక, బాలీవుడ్ లో ఫెమినిస్ట్ కథానాయికలందరిలో షివరింగ్ మొదలైంది.
By: Tupaki Desk | 6 Jun 2025 9:11 AM ISTబాలీవుడ్ అగ్ర కథానాయిక దీపిక పదుకొనే బ్యాక్ టు బ్యాక్ క్రైసిస్ లో పడటంపై ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో 'కల్కి 2898 ఏడి' లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్‌లో నటించిన దీపిక నిజానికి ఆ సనిమా సెట్స్ లో ప్రవేశించక ముందే 'ఫెమినిజం' ఎజెండాను తెరపైకి తెచ్చింది. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీపై సర్జికల్ స్ట్రైక్స్ కి ప్రయత్నించింది. అప్పటికి అది సమస్య కాలేదు. కొన్నాళ్ల పాటు ఫెమినిజం హవాను సాగించింది కానీ, సందీప్ రెడ్డి వంగా ముందు ఎలాంటి హవా పని చేయలేదు. స్ట్రైక్స్ మిస్ ఫైర్ అయి ఊహించని రిజల్ట్ ని ఎదుర్కొంది. సంగతి తెలిశాక, క్షణాల్లో నిర్ణయం తీసుకోగల మిసైల్ లాంటోడు సందీప్ వంగా. అతడు కొన్ని నిమిషాల్లోనే తీసుకున్న ఒక కఠోరమైన నిర్ణయం దీపిక కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' నుంచి దీపిక పదుకొనేను తొలగించడం బిగ్ బ్లో ట్రీట్. క్షణాల్లోనే ట్రిప్తి దిమ్రీని ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసుకుని ఇంకా పెద్ద షాకిచ్చాడు. ఇది ఊహించనిది. ఆ తర్వాత 'స్పిరిట్- ఏ రేటెడ్ సినిమా!' అంటూ దీపిక పీఆర్ ప్రాజెక్ట్ ను తక్కువ చేసేందుకు, డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నించింది. చివరికి పీఆర్ టాక్సిక్ టాక్టిక్స్ గురించి కూడా సందీప్ వంగా సోషల్ మీడియాల్లో విరుచుకుపడ్డాడు. చెత్త పీఆర్ ట్రిక్స్ పై ధుమధుమలాడాడు.
అయితే దీపిక బ్యాడ్ టైమ్ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ భామ రెక్లెస్ యాటిట్యూడ్ కారణంగా 'స్పిరిట్' నుంచి తొలిగించారనే సమాచారం వెలువడ్డాక, బాలీవుడ్ లో ఫెమినిస్ట్ కథానాయికలందరిలో షివరింగ్ మొదలైంది. సీనియర్ నటి కాజోల్, కరీనా సహా చాలా మంది ఫెమినిజానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండే కథానాయికలు, తమకు అవకాశాలు ఇలాంటి ఒక కారణంతో గాల్లో కొట్టుకుపోతే పరిస్థితి ఉందని అర్థం చేసుకున్నారు. చాలామంది భయపడ్డారు. ఫీమేల్ ఆర్టిస్టులను గౌరవించి వారి కోసం బలమైన పాత్రలను రాసుకునే సందీప్ వంగా ఇలా చేసాడేమిటీ? అనే భయం మొదలైంది.
ఇప్పుడు దీపికకు అవకాశాలిచ్చిన ఇతర నిర్మాతలు కూడా దీనిపై ఆలోచిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక ఇప్పటికే 'కాక్ టైల్ 2'లో అవకాశం కోల్పోయింది. అయితే దానికి కారణం వేరు కావొచ్చు. కానీ కెరీర్ లో మరో పెద్ద ఆఫర్ ని కోల్పోయింది. బ్లాక్ బస్టర్ 'కాక్ టైల్'లో దీపిక- సైఫ్ రొమాన్స్ అద్భుతంగా వర్కవుటైంది. కానీ కాక్ టైల్ సీక్వెల్ లో ఇప్పుడు షాహిద్ - రష్మిక జంటను ఎంపిక చేసుకున్నారు మేకర్స్. ఇందులో కృతి సనోన్ కూడా ఒక కథానాయిక. స్పిరిట్ నుంచి వైదొలిగాక బ్యాడ్ టైమ్ రన్ అవ్వడం అంటే ఇదే!
మరోవైపు బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 ఏడి' సీక్వెల్ పై నాగ్ అశ్విన్- అశ్వనిదత్ బృందం పని చేస్తున్నారు. ఈ సినిమాలో దీపిక కొనసాగుతుందా లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. దీపిక వైఖరి తెలిసిన దత్ బృందం ఇప్పుడు సీక్వెల్ లో అవకాశం కల్పిస్తుందా? అన్నది వారి విజ్ఞతికే వదిలేయాలని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం చర్చల దశలో ఉన్న వేరొక సినిమాలోను దీపిక అవకాశం కోల్పోయిందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పీఆర్ టాక్టిక్స్ దీపికకు మినిమంగా రూ. 50 కోట్ల మేర కొద్దిరోజుల్లోనే నష్టం కలిగించాయని గుసగుసలు వినిపిస్తున్నాయ్.
