ఆ ప్రశ్నకు మాత్రం ఎప్పటికీ సమాధానం చెప్పలేను!
దీపికా ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నప్పటికీ అమ్మడి కెరీర్ స్టార్ట్ అయింది మాత్రం సౌత్ నుంచే.
By: Tupaki Desk | 11 April 2025 6:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో నటించి సౌత్ ఆడియన్స్ ను కూడా ఇంప్రెస్ చేసిన దీపికా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తోంది. దీపికా ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నప్పటికీ అమ్మడి కెరీర్ స్టార్ట్ అయింది మాత్రం సౌత్ నుంచే.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సరసన నటించి హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన దీపికా తర్వాత ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2007లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్నుంచి దీపికా బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అంతటి స్టార్ హీరోయిన్ ఓ ప్రశ్నకు మాత్రం తన దగ్గర సమాధానం లేదంటోంది.
బెంగుళూరు, ముంబైలో ఏది ముఖ్యం అని అడిగితే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టమంటోంది దీపికా. ఈ ప్రశ్నకు తాను ఎప్పటికీ ఆన్సర్ ఇవ్వలేనని తాజాగా తన ఇన్‌స్టాలో ఓ సరదా వీడియోను షేర్ చేస్తూ ముంబై, బెంగుళూరు గురించి మాట్లాడింది దీపికా. తన చిన్నతనమంతా బెంగుళూరులోనే గడిచిందని, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నానని, ఎప్పుడైనా బెంగుళూరు వెళ్తే తన ఇంటికి వెళ్లినట్టు అనిపిస్తుంటుందని దీపికా వెల్లడించింది.
తన లైఫ్ లో ఎక్కువ భాగం బెంగుళూరులోనే స్పెండ్ చేశానని, తన ఫ్రెండ్స్, స్కూల్, కాలేజీ అన్నీ బెంగుళూరులోనే ఉన్నాయని, అందుకే ఎప్పుడు బెంగుళూరు వెళ్లినా ఆ రోజులన్నీ గుర్తొస్తాయని చెప్తోన్న దీపికా ముంబై తనకు కెరీర్ పరంగా లైఫ్ ను ఇచ్చిందని, అందుకే ముంబైలోనే ఉంటున్నానని, ఈ రెండు ప్రాంతాలు తనకు ఎప్పటికీ స్పెషలే అంటోంది. రెండింట్లో ఏది ఇష్టమని అడిగితే మాత్రం చెప్పలేనని దీపికా తెలిపింది.
