AA22: దీపికా ఇక్కడ తగ్గిందా?
అల్లు అర్జున్ నటిస్తున్న ‘AA22’ (AA22xA6) సినిమా టాలీవుడ్‌లో భారీ హైప్‌ను సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jun 2025 9:49 AM ISTఅల్లు అర్జున్ నటిస్తున్న ‘AA22’ (AA22xA6) సినిమా టాలీవుడ్‌లో భారీ హైప్‌ను సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్ తర్వాత, అట్లీ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ‘పారలల్ యూనివర్స్’ జానర్‌లో రూపొందుతోందని, అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా 2026 చివరిలో విడుదల కానుంది, దీని కోసం అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌తో ఫిజికల్ ట్రైనింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ సరసన ‘స్పిరిట్’ సినిమాలో నటించే అవకాశాన్ని దీపికా కోల్పోయింది. ‘స్పిరిట్’ నుంచి ఆమె తప్పుకోవడానికి రూ. 20 కోట్ల రెమ్యునరేషన్, 15% షేర్ డిమాండ్ చేయడమే కారణమని చర్చలు జరిగాయి.
ఆమె డిమాండ్స్‌ను వంగా తిరస్కరించడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్-అట్లీ సినిమాలో చేరడం దీపికాకు మరో భారీ అవకాశంగా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు కూడా నటిస్తున్నారని సమాచారం. స్టార్ హీరోయిన్లతో రూపొందుతున్న ఈ సినిమాలో చేరడానికి దీపికాకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఒక భారీ తెలుగు ప్రాజెక్ట్‌లో భాగం కావాలనే ఆమె ఈ సినిమాను ఎంచుకుందని అంటున్నారు.
అయితే, ఈ సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ గురించి సస్పెన్స్ నెలకొంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, దీపికాకు ఈ సినిమాలో ఎలాంటి షేర్ ఇవ్వడం లేదని, ఆమె ‘కల్కి 2898 AD’ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌నే ఈ సినిమాకు కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. ‘కల్కి 2898 AD’ కోసం ఆమె రూ. 15 కోట్లు + GST తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ రెమ్యునరేషన్ విషయంలో ఆమె ఎందుకు తగ్గిందని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
బహుశా స్పిరిట్ డేట్స్ కంటే AA22 సినిమా డేట్స్ తక్కువ అడిగి ఉంటారనే కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఆమె డిమాండ్స్ కి కొన్నింటికి ఓకే చెప్పి ఉండవచ్చని మరో వాదన. ఏదేమైనా స్పిరిట్ తో వచ్చిన నెగిటివ్ వైబ్ ను పోగొట్టుకునేలా.. వెంటనే మరో పెద్ద సినిమా చేయాలని ఆలోచించి ఉండవచ్చు అని మరికొందరు అంటున్నారు.
ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్, దీపికా లుక్స్‌పై టీమ్ ఇప్పటికే పనిచేస్తోంది. అట్లీ ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీగా మార్చే ఆలోచనలో ఉన్నాడని, హాలీవుడ్ VFX టీమ్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతోందని సమాచారం. ఇక షూటింగ్ జూన్ 2025లో ప్రారంభమవుతుంది. మొత్తంగా, ‘AA22’ సినిమా దీపికా-అల్లు అర్జున్ కాంబోతో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. దీపికా రెమ్యునరేషన్‌పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఈ సినిమా 2026లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
