దీపికా అతనికి కౌంటరిచ్చిందా?
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కు ఎంత పెద్ద ఫాలోయింగ్, స్టార్‌డమ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే ఆ సినిమాకు ఎంతో హైప్ వచ్చేస్తుంది.
By: Tupaki Desk | 28 May 2025 12:36 PM ISTబాలీవుడ్ నటి దీపికా పదుకొణె కు ఎంత పెద్ద ఫాలోయింగ్, స్టార్‌డమ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఒక సినిమాలో నటిస్తుందంటే ఆ సినిమాకు ఎంతో హైప్ వచ్చేస్తుంది. అంతేకాదు, దీపికా ఏ విషయాన్నైనా మొహమాట పడకుండా మొహం మీదే చెప్పేస్తూ ఉంటుంది. అయితే గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో దీపికా పేరు తెగ వినిపిస్తోంది.
దానికి కారణం ప్రభాస్ సినిమా. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే పాన్ ఇండియా సినిమా స్పిరిట్ లో ముందు దీపికా పదుకొణె నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి సడెన్ గా త్రిప్తి డిమ్రి వచ్చింది. ఈ విషయంలో గత కొన్నాళ్లుగా వార్తలు రాగా రీసెంట్ గా సందీప్ రెడ్డి కూడా ఈ విషయంపై మాట్లాడి దీపికా పేరు హైలైట్ అయ్యేలా చేశాడు.
తన సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సందీప్ మాట్లాడిన మాటలు దీపికాను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతుండగా, ఇప్పుడు తాజాగా దీపికా పదుకొణె నిజాయితీ గురించి మాట్లాడి మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఓ ఫ్యాషన్ షో లో పాల్గొన్న దీపికా తానెప్పుడూ తన మనసు చెప్పేదే వింటానని ఈ సందర్భంగా దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది.
లైఫ్ లో బ్యాలెన్డ్స్ గా ఉండాలంటే నిజాయితీ అనేది ఎంతో ముఖ్యమని, తాను అన్నింటికంటే మొదటిగా ఎక్కువ ప్రాధాన్యతను దానికే ఇస్తానని, కష్టమైన సిట్యుయేషన్స్ లో కూడా తాను తన మనసు మాటే వింటానని, ఆ తర్వాతే డెసిషన్స్ తీసుకుంటానని, ఎలాంటి సిట్యుయేషన్స్ ను అయినా ఎదుర్కొనే సత్తా తనకుందని దీపికా చెప్పారు. అయితే దీపికా ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఆ డైరెక్టర్ చేసిన కామెంట్సేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
