Begin typing your search above and press return to search.

దీపికకు ఎంతిస్తున్నారు? ఆ డిమాండ్ కు ఓకే చెప్పారా?

హీరోయిన్ దీపికా పదుకొణె.. కొద్ది రోజులుగా ఆమె పేరు ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంటుంది. వరుస పరిణామాలు.. వార్తల్లో నిలిచేలా చేసింది.

By:  Tupaki Desk   |   7 Jun 2025 7:54 PM IST
దీపికకు ఎంతిస్తున్నారు? ఆ డిమాండ్ కు ఓకే చెప్పారా?
X

హీరోయిన్ దీపికా పదుకొణె.. కొద్ది రోజులుగా ఆమె పేరు ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంటుంది. వరుస పరిణామాలు.. వార్తల్లో నిలిచేలా చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన స్పిరిట్ మూవీ నుంచి ఆమెను హీరోయిన్ గా తప్పించడంతో ఒక్కసారిగా ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఆమె బదులు యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని ఫిమేల్ లీడ్ రోల్ లో ఫిక్స్ చేశారు. అదే సమయంలో సందీప్.. సోషల్ మీడియాలో డర్టీ పీ ఆర్ గేమ్స్ అంటూ పోస్ట్ చేశారు. 100 శాతం నమ్మకంతో కథ చెబితే.. స్టోరీని ఇప్పుడు లీక్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో సందీప్ పోస్ట్.. దీపికను ఉద్దేశించే పెట్టారని అంతా ఫిక్స్ అయ్యారు.

అదే సమయంలో దీపిక.. సినిమా విషయంలో పలు కండీషన్స్ పెట్టిందని.. అది నచ్చక సందీప్ వంగా తప్పించారని జోరుగా ప్రచారం జరిగింది. తక్కువ టైమ్ వర్క్, ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేసినట్లు టాక్ వచ్చింది. ఆ తర్వాత త్రిప్తిని తీసుకోవడాన్ని అంగీకరించలేక.. స్టోరీ లీక్ చేశారని గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు 35 రోజులకు గాను రూ.25 కోట్లు డిమాండ్ చేసిన దీపికా పదుకొణె.. మూవీ లాభాల్లో 10 శాతం వాటా అడిగిందని వార్తలు వస్తున్నాయి. తెలుగు డైలాగ్స్ చెప్పేందుకు కూడా ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే ఆమె కండీషన్స్ నచ్చక సందీప్ ఆ నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఇప్పుడు ఆ మ్యాటర్.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ తర్వాత కల్కి సీక్వెల్ నుంచి కూడా ఆమెను తప్పించినట్లు కొన్ని గంటలుగా వార్తలు వస్తుండగా.. ఇప్పుడు దీపికను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు AA22XA6 మేకర్స్ అనౌన్స్ చేశారు. సినిమాలో హీరోయిన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు.. యాక్షన్ సీన్స్ లో ఆమె కనిపించనున్నట్లు వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు దీపికకు రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. పారితోషికం విషయంలో ఆమె కాంప్రమైజ్ అయ్యేలా ఎప్పుడూ కనపడలేదు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ కు కూడా అంతే డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఆమె చెప్పినంత ఇస్తామంటేనే సైన్ చేసుంటుందని సినీ ప్రియులు, నెటిజన్లు అనుకుంటున్నారు. అలా AA22XA6కు దీపిక ఎంత అడిగితే అంత ఇస్తున్నారేమో మరి మేకర్స్.