దీపిక- సందీప్ ఇష్యూ.. డైరెక్టర్ భార్య స్పందన ఇలా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 July 2025 8:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఆడియన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిట్ బొమ్మ అని అంతా ఫిక్సయిపోయారు.
అయితే రీసెంట్ గా ఆ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను తప్పించిన సందీప్.. యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రీ ఫిమేల్ లీడ్ రోల్ లో సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత తన మూవీ స్టోరీ లీక్ చేశారని, ఇదేనా ఫెమినిజమంటూ దీపిక అండ్ టీమ్ పై మండిపడ్డారు. ఏం చేసుకుంటారో చేసుకోండని వార్నింగ్ ఇచ్చారు.
8 గంటల వర్కింగ్ అవర్స్, రెమ్యునరేషన్ విషయంలో సందీప్, దీపిక మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇదంతా జరిగిందని సమాచారం. అది జరిగి కొన్ని రోజులు గడుస్తున్నా.. ఇండస్ట్రీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై జోరుగా చర్చ జరుగుతోంది. కొందరు దీపికకు సపోర్ట్ గా మాట్లడుతుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇప్పుడు డైరెక్టర్ కబీర్ ఖాన్ భార్య, టెలివిజన్ యాంకర్ మినీ మాథుర్ స్పందించారు. దీపిక ఒక తల్లి అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆమె వ్యాఖ్యలకు వచ్చిన స్పందన ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రజలు అందరూ తమ తల్లుల మార్గదర్శకత్వంలో పెరిగే దేశంలో నివసిస్తున్నారని గుర్తుచేశారు.
ఒక నటి తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎనిమిది గంటలు మాత్రమే షూటింగ్ లో పాల్గొనాలని అనుకుంటే అది సమస్య కాకూడదని మినీ పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడానికి ఇది ఒక కారణమని అభిప్రాయపడిన ఆమె.. దీపికకు ఇలాంటి వేస్ట్ మ్యాటర్ అవసరం లేదని, తన బిడ్డతో సమయం గడపాలని కోరారు.
12 గంటల వర్కింగ్ అవర్స్ హామీ ఇచ్చిన తర్వాత రెండు గంటలు మాత్రమే సెట్ కు వచ్చే హీరోలు ఉన్నారని వ్యాఖ్యానించారు. అయినా ఒక మహిళ ఎనిమిది గంటలు మాత్రమే డిమాండ్ చేసిందని, నటిగా తనకు అర్హత కంటే ఎక్కువగా కోరుకోలేదని అన్నారు. దీపిక తన పరిస్థితిని అర్థం చేసుకోలేని వ్యక్తులతో పనిచేయడం మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
