సౌత్ ఆడియన్స్ ని కాకా పడుతున్నారా?
తాజాగా ఈ విషయాన్ని పసిగట్టిన భామా మణులు దీపిక, జాన్వీ, అలియా భట్ లు సౌత్ లో క్రేజ్ పెంచుకునే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది.
By: Tupaki Desk | 12 April 2025 7:00 AM ISTసౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వాలని బాలీవుడ్ భామలంతా క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఛాన్స్ ఎవరి స్తారా? అని స్టార్ హీరోయిన్లు అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అలియాభట్, దీపికా పదుకొణే, జాన్వీ కపూర్ లాంటి భామలు సక్సెస్ పుల్ గా ఎంట్రీ ఇచ్చేసారు. ఇదే వరుసలో మరింత మంది లాంచ్ అవ్వాలని చూస్తున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియా క్రేజ్ చూసి ఆ పోటీ మరింతగా పెరుగుతుంది. అదే జరిగితే పాత నీరు పోవడం అన్నది సహజమే.
తాజాగా ఈ విషయాన్ని పసిగట్టిన భామా మణులు దీపిక, జాన్వీ, అలియా భట్ లు సౌత్ లో క్రేజ్ పెంచుకునే కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా దక్షిణాదితో తమకున్న పాత అనుబంధాలను ఒక్కొక్కటిగా తవ్వి తీస్తున్నారు. దీపిక స్వస్థలం బెంగుళూరు. ఐశ్వర్యారాయ్ తర్వాత బెంగుళూరు నుంచి బాలీవుడ్ కి వెళ్లి ఆ రేంజ్ లో సక్సెస్ అయింది దీపికనే.
కానీ ఎప్పుడు బెంగుళూరు గురించి పెద్దగా పెదవి విప్పని బ్యూటీ ఈ మధ్య సమయం దొరికినప్పుడల్లా సిలికాన్ సిటీ అనుబంధాలు గుర్తు చేసుకుంటుంది.స్కూల్ , ట్యూషన్, కాలేజీ స్నేహితుల్ని మిస్ అవుతున్నట్లు...కాలేజ్ బంక్ కొట్టి బెంగుళూరు సిటీలో తిరిగిన రోజుల్లోకి వెళ్లిపోతుంది. అక్కడ ప్రజలతో తనకున్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. అలాగే హైదరాబాద్ తో ఉన్న రిలేషన్ షిప్ ను గుర్తు చేసుకుంది.
ఈ విషయంలో జాన్వీకపూర్ కూడా ఎక్కడా తగ్గలేదు. చెన్నై, హైదరాబాద్, తిరుపతితో తనుకున్న ప్రత్యేక బంధాన్ని సమయం చిక్కినప్పుడల్లా గుర్తు చేస్తుంది. బాల్యంలో చెన్నై లో ఉన్న రోజుల్ని, శ్రీదేవి తల్లి దండ్రుల కుటుంబ సభ్యుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తోంది. అలియాభట్ మూలాలు సౌత్ లో లేకపోవడంతో? సినిమా ప్రమోషన్లకు కోసం బెంగుళూరు, హైదరాబాద్ వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు చూపించిన ప్రేమను ఎరగా వేసి బుట్టలో వేస్తోంది. ఈ ముగ్గురు భామలు సౌత్ అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నారంటూ కామెంట్లు గుప్పించడం నెటి జనుల వంత్తైంది.
